IRCTC Tour Packages : టూరిస్టులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్- విశాఖ నుంచి కేరళ, అస్సాం స్పెషల్ టూర్ ప్యాకేజీలు
IRCTC Tour Packages : విశాఖ నుంచి కేరళ, అస్సాం మేఘాలయ టూర్ ప్యాకేజీలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. సుందరమైన కేరళ, మేజికల్ మేఘాలయ పేరుతో ఈ ఎయిర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
IRCTC Tour Packages : టూరిస్టులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి కేరళ, అస్సాం టూర్లకు స్పెషల్ ఎయిర్ ప్యాకేజీలను ప్రకటించింది. సుందరమైన కేరళ, మేజికల్ మేఘాలయ పేరుతో ఈ ఎయిర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్రాల సందర్శించే భక్తులకు, మరోవైపు పర్యాటక ప్రాంతాలను చూసి ఆనందించేందుకు టూరిస్టులకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తుంది.
పర్యాటకుల కోసం కేరళ, అస్సాం మేఘాలయ టూర్లకు ఈ ఎయిర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ విశాఖ ఏరియా అధికారి ఎ.నిరంజన్ తెలిపారు. సుందరమైన కేరళ ట్రిప్‌తో పాటు మేజికల్ మేఘాలయ ట్రిప్‌లను ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నామని తెలిపారు.
సుందరమైన కేరళ ప్యాకేజీ
జనవరి 24 నుంచి జనవరి 30 వరకు టూర్ ఉంటుంది. మొత్తం ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉంటుంది. ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీ-రూ.64,520, డబుల్ ఆక్యుపెన్సీ-రూ.45,670, ట్రిపుల్ ఆక్యుపెన్సీ -రూ.42,890 టూర్ ప్యాకేజీ ధర చెల్లించాలి. ఈ ప్యాకేజీలో విశాఖపట్నం-కొచ్చి-విశాఖపట్నం విమాన టిక్కెట్లు, ఏసీ హోటల్ వసతి, మూడు పూటల టిఫిన్, భోజనం సదుపాయం, సందర్శనా స్థలాలు కోసం ఏసీ వాహనం, మున్నార్, తేక్కడి హిల్ స్టేషన్‌లో నాన్ ఏసీ గదులు, ప్రయాణ బీమా, టూర్ మేనేజర్ సేవలు ఉంటాయి.
సందర్శించే ప్రదేశాలు
- కొచ్చిలో మెరైన్ డ్రైవ్, ఫోర్ట్ కొచ్చి సందర్శనా స్థలాలు (డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, శాంటా క్రజ్ బాసిలికా).
- మున్నార్‌లో ఎరవికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండలా డ్యామ్ లేక్, పునర్జని కర్చరల్ విలేజ్.
- కుమరకోమ్, అలెప్పీ : కుమరకోమ్, అలెప్పీ వద్ద హౌస్ బోట్
- తేక్కడి : పెరియర్ వన్యప్రాణుల అభయారణ్యం, స్పైస్ ప్లాంటేషన్.
- త్రివేండ్రం : శ్రీ పద్మనాభస్వామి ఆలయం, అజిమల ఆలయం, కోవలం బీచ్
మేజికల్ మేఘాలయ ప్యాకేజీ
ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18 వరకు టూర్ ఉంటుంది. మొత్తం ఆరు రాత్రులు, ఏడు పగళ్లు టూర్ సాగుతోంది. ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీ-రూ.63,635, డబుల్ ఆక్యుపెన్సీ-రూ.46,085, ట్రిపుల్ ఆక్యుపెన్సీ -రూ.44,205 ఉంటుంది. ఈ ప్యాకేజీలో విశాఖపట్నం-గౌహతి-విశాఖపట్నం విమాన టిక్కెట్లు, షిల్లాంగి మూడు రాత్రుల హోటల్ వసతి, కాజిరంగాలో ఒక రాత్రి హోటల్ వసతి, గౌహతిలో రెండు రాత్రుల హోటల్ వసతి, మూడు పూటల టిఫిన్, భోజనం సదుపాయం, సందర్శనా స్థలాలు కోసం ఏసీ వాహనం, ప్రయాణ బీమా, టూర్ మేనేజర్ సేవలు ఉంటాయి.
సందర్శించే ప్రదేశాలు
- గౌహతి : కామాఖ్య దేవాలయం, బాలాజీ దేవాలయం
- చిరపుంజీ : నోహ్కలికై జలపాతం, మావ్స్మై గుహలు, ఎలిఫెంటా జలపాతం.
- మావ్లిన్నాంగ్ : లివింగ్ రూట్ బ్రిడ్జ్, డాకీ సరస్సు.
- కజిరంగా నేషనల్ పార్క్
సంప్రదించాల్సిన చిరునామా : ఐఆర్‌సీటీసీ, ప్రధాన ప్రవేశ ద్వారం, గేట్ నెంబర్-1, రైల్వే స్టేషన్, విశాఖపట్నం-530004, అదనపు సమాచారం కోసం చందన్ కుమార్-9281030748, సాయి ప్రసాద్ -9281495847, వెంకటేశ్వరరావు-9550166168లను సంప్రదించాల్సి ఉంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం