AP Inter Exams: యథాతథంగా 2026 ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ప్రతిపాదన విరమించుకున్న ఏపీ ఇంటర్‌ బోర్డు-inter board backtracks on first year exam cancellation plan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Exams: యథాతథంగా 2026 ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ప్రతిపాదన విరమించుకున్న ఏపీ ఇంటర్‌ బోర్డు

AP Inter Exams: యథాతథంగా 2026 ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ప్రతిపాదన విరమించుకున్న ఏపీ ఇంటర్‌ బోర్డు

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 30, 2025 09:40 AM IST

AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదనలను బోర్డు ఉపసంహరించుకుంది. 2026 మార్చి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని రద్దు చేయాలనే యోచనతో ఇటీవల సూచనలు, సలహాలను ఇంటర్ బోర్డు ఆహ్వానించింది. పరీక్షల రద్దు నిర్ణయాన్ని అంతా వ్యతిరేకించడంతో యథాతథంగా పరీక్షల నిర్వహణ జరుపనున్నారు.

ఏపీలో యథాతథంగా  ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
ఏపీలో యథాతథంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

AP Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది పరీక్షలను రద్దు చేయాలనే ఆలోచనను ఇంటర్ బోర్డు ఉపసంహరించుకుంది. ఇంటర్ మొదటి ఏడాదిలో పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్‌ బోర్డుకు వచ్చిన సూచనలు, సలహాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

yearly horoscope entry point

ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల కోసం కొద్ది వారాల క్రితం బోర్డు పలు ప్రతిపాదనలు చేసింది. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజీలు, మేధావుల నుంచి సలహాలు సూచనల్ని స్వీకరించారు.

బోర్డు ప్రతిపాదించిన సంస్కరణలపై పబ్లిక్‌ నుంచి వచ్చిన సూచనలు, సలహాలకు అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేయడంతో పాటు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతూ పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై జనవరి 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఇంటర్‌ విద్యపై విద్యా రంగంలో ఉన్న వారి సూచనలు, సలహాల మేరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ఇంటర్‌ ఫస్టియర్‌లో పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని, వారిలో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని, ఇది మొత్తం ఇంటర్‌ విద్యపై ప్రభావం చూపుతుందని, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఎక్కువ నష్టపోతారని పలు సూచనలు వచ్చాయి. ఫస్టియర్‌లో అంతర్గత మార్కుల విధానం అమలు చేస్తే అది కార్పోరేట్‌ ,ప్రైవేట్ కాలేజీలకు లబ్ది చేకూరుస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

మెజార్టీ అభిప్రాయాలు పరీక్షల నిర్వహణకే అనుకూలంగా రావడంతో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు కామన్‌ పరీక్షలు నిర్వహి స్తారు.

మ్యాథ్స్‌లో ఇక ఒకటే పేపర్…!

ఏపీలో ఇంటర్ పరీక్షల్లో గణితంలో రెండు పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. ఇది విద్యార్ధుల్ని ఒత్తిడికి గురి చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఒకటే పేపర్ ఉంటోంది. ఇకపై మ్యాథ్స్్లో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. బోటనీ, జువాలజీలను కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ అమలు చేస్తారు.

ఎంబైైపీసీ గ్రూపుకు సై…

ప్రస్తుతం ఉన్న రెండు భాష సబ్జెక్టుల్లో ఇంగ్లీష్‌ తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టు స్థానంలో విద్యా ర్థులు ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ఈ నిర్ణయాలపై ఇంటర్మీడియట్ బోర్డు తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

ఇంటర్‌ బోర్డు పాత ప్రతిపాదనలు ఇవే…

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ పరీక్షల్ని తొలగిస్తే మొదటి ఏడాది సిలబస్‌లో కీలక అంశాలపై పట్టు సాధించడంతో పాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు నీట్, జేఈఈ పరీక్షల్లో విజయం సాధించడానికి వీలవుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

సైన్స్‌ గ్రూపుల్లో ఉమ్మడి ఏపీలో చివరి సారి సిలబస్‌ సవరణలు జరిగాయి. ఇంటర్‌ ఫస్టియర్ సిలబస్‌ 2021-13, సెకండియర్‌ 2013-14లో మార్చారు. ఆర్ట్స్‌ సిలబస్‌ 2014-16 మధ్య కాలంలో మార్చారు. లాంగ్వేజ్‌ సిలబస్‌ను 2018-20 మధ్య సవరించారు. దీనిపై విద్యా రంగ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీలతో అధ్యాయనం చేసిన తర్వాత 2025-26 నుంచి ఇంటర్ విద్యలో ఎన్‌సిఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది.

ఇకపై 500 మార్కులకే ఇంటర్‌ పరీక్షలు

కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్‌ పరీక్షల విధానంలో కూడా సమూల మార్పులు చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే సంస్కరణల్లో ఇంటర్‌ పరీక్షల్ని 500మార్కులకు నిర్వహిస్తారు. ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపుల్లో పరీక్షల్ని 500మార్కులకు పరిమితం చేస్తారు.

ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో సివిక్స్‌, కామర్స్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌ వంటి సబ్జెక్టులో 100 మార్కులకు 80మార్కులకు థియరీ పరీక్షల్ని నిర్వహిస్తారు. ప్రాజెక్ట్‌ వర్క్‌, పరిశోధనా కార్యక్రమాలకు మరో 20 మార్కులు కేటాయిసతారు. ప్రతి కోర్సుకు గరిష్టంగా 500మార్కులకు పరీక్షలు జరుగుతాయి.

ఎంపీసీ గ్రూపులో 380 మార్కులకు థియరీ పరీక్షలు,120 మార్కులను ఇంటర్నల్‌, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.ఎంపీసీ గ్రూపులో ఇంగ్లీష్‌కు 80 +20మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20మార్కులు, గణితం/జీవ శాస్త్రంకు 80+20మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయిన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్న్/ప్రాక్టికల్ తప్పని చేశారు. మొత్తం పరీక్షల్లో థియరీకి ఎంపీసీలో 380+120 సాధించాలి.

బైపీసీ గ్రూపులో 370 మార్కులను థియరీ పరీక్షలకు, 130 మార్కులను ఇంటర్నల్‌, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.బైపీసీ గ్రూపులో ఇంగ్లీష్‌కు 80 +20మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20మార్కులు, గణితం/జీవ శాస్త్రంకు 80+20మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయిన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్న్/ప్రాక్టికల్ తప్పని చేశారు.

ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఏకపద సమాధానాలు వంటి వాటికి మార్కుల్ని ప్రతిపాదించారు. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు బదులు 5/6 మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం