Indrakeeladri Income: ఇంద్రకీలాద్రి హుండీ ఆదాయం రెండు వారాలకు రూ.2.83కోట్లు, 431గ్రాముల బంగారం
Indrakeeladri Income: భక్తల కొంగుబంగారమైన బెజవాడ దుర్గమ్మ ఆలయ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. గత నెలలో దసరా ఉత్సవాల హుండీల లెక్కింపు జరిగింది. ఆ తర్వాత పక్షం రోజులకు అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపును మహా మండపంలో నిర్వహించారు. రూ.2.83కోట్ల ఆదాయం, 431 గ్రాముల బంగారం సమకూరింది.
Indrakeeladri Income: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత 15 రోజులకు హుండీల ద్వారా భక్తులు అమ్మవారికి రూ. 2,83,53 ,460 కానుకలు సమర్పించారు. కానుకల రూపంలో 431 గ్రాముల బంగారం, 6 కేజీల 450 గ్రాముల వెండిని భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
అమ్మవారికి విదేశీ కరెన్సీ ద్వారా కూడా పలువురు భక్తులు కానుకలు సమర్పించారు. అమెరికా డాలర్లు 324, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్ 25, ఇండోనేషియా 30000 రూపాయలు, 10 యూరోలు, ఒమన్- 1 రియాళ్, 400 బైంసాలు, కెనెడా కరెన్సీ 40 డాలర్లు, సౌదీ రియాల్స్ 6, కెనడా డాలర్లు 220, ఇంగ్లాండ్ కరెన్సీ 30, ఆస్ట్రెలియా 25 డాలర్లు 25, ఖతార్ రియాల్స్ 144 లబించాయి.
బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ డీప్యూటీ ఈవో రత్న రాజు , దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. online నందు e - హుండీ ద్వారా రూ.89,633/-లు భక్తులు చెల్లించుకున్నారు.