NRI Death Mystery: అమెరికాలో తెలుగు యువతి అనుమానాస్పద మృతి
NRI Death Mystery: అమెరికాలో అదృశ్యమైన ప్రవాస భారతీయ యువతి పతివాడ లహరి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. టెక్సాస్‌లో అదృశ్యమైన లహరి ఓక్లహామాలో శవమై కనిపించింది.
NRI Death Mystery: అమెరికాలో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. టెక్సాస్‌లో మే రెండో వారంలో అదృశ్యమైన పతివాడ లహరి అనే ఇండో - అమెరికన్ యువతి ఓక్లహామాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.
టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలోని ఓక్లహామాలో లహరి మృతదేహం లభ్యమైంది. యువతి అదృశ్యమైన వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఓక్లహామాలో మృతదేహం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
టెక్సాస్‌లోని మెక్‌కిన్నే ప్రాంతానికి చెందిన లహరి ఓవర్‌ల్యాండ్ రీజనల్ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. మే 12న విధులు ముగిసిన తర్వాత ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరిసారిగా డాలస్ నగర శివారులో నల్ల టయోటా కారును నడుపుతూ ఆమె కనిపించారని స్థానికులు తెలిపారు. కెన్సస్ విశ్వవిద్యాలయం నుంచి లహరి పట్టభద్రు రాలయ్యారు. యువతి ఎలా మృతి చెందారనేది మిస్టరీగా మారింది.
మెకిన్నే సబర్బ్‌లో పని చేయడానికి వెళ్లిన సమయంలో బ్లాక్ టయోటాను నడుపుతూ స్థానికులకు ఆమె కనిపించింది. ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం, లహరి ఓవర్‌ల్యాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో పనిచేశారు. కాన్సాస్ విశ్వ విద్యాలయం నుండి పట్టభద్రురాలైన లహరి, బ్లూ వ్యాలీ వెస్ట్ హై స్కూల్‌లో చదువుకున్నారు. ఆమె మరణం స్థానికుల్ని విషాదంలో నింపింది. టెక్సాస్ నుంచి ఓక్లహామా ఎందుకు వెళ్లిందనేది మిస్టరీగా మారింది.