Special Trains : ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. రెండు ప్రత్యేక రైళ్లు కొనసాగింపు.. 16 ట్రైన్లకు అద‌న‌పు కోచ్‌లు-indian railways continues two special trains and adds additional coaches to 16 trains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. రెండు ప్రత్యేక రైళ్లు కొనసాగింపు.. 16 ట్రైన్లకు అద‌న‌పు కోచ్‌లు

Special Trains : ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. రెండు ప్రత్యేక రైళ్లు కొనసాగింపు.. 16 ట్రైన్లకు అద‌న‌పు కోచ్‌లు

HT Telugu Desk HT Telugu
Jan 31, 2025 02:25 PM IST

Special Trains : ప్ర‌యాణికుల‌కు ఇండియ‌న్ రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రయాణానికి సౌకర్యంగా ఉండటానికి, అదనపు రద్దీని తగ్గించడానికి రెండు వీక్లీ స్పెష‌ల్ రైళ్ల‌ సేవలను పొడిగించాల‌ని నిర్ణయించింది. అలాగే 16 రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌ల‌ను జ‌త చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రత్యేక రైళ్లు కొనసాగింపు
ప్రత్యేక రైళ్లు కొనసాగింపు

రైలు నెంబ‌ర్‌ 07165 హైదరాబాద్ - కటక్ స్పెష‌ల్‌ రైలును మార్చి 25 వ‌ర‌కు పొడిగించారు. ఈ రైలు ప్ర‌తి మంగళవారం రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ఆ రైలు మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడ చేరుకుని.. ఉద‌యం 9.07 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది.

రైలు నెంబ‌ర్‌ 07166 కటక్-హైదరాబాద్ స్పెష‌ల్ రైలును మార్చి 26 వ‌ర‌కు పొడిగించారు. ఈ రైలు ప్ర‌తి బుధ‌వారం రాత్రి 10:30 గంటలకు కటక్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉద‌యం 7.35 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డ నుంచి ఉద‌యం 7.37 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. రాత్రి 7.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు హైద‌రాబాద్‌-క‌ట‌క్ మ‌ధ్య సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ -4, థ‌ర్డ్ ఏసీ-8, స్లీపర్-6, జనరల్ క్లాస్-2 , జనరేటర్ మోటార్ కార్లు-2 కోచ్‌లు ఉంటాయి. ప్రజలు ఈ ప్రత్యేక రైలు సేవలను ఉపయోగించుకోవాలని ఇండియ‌న్ రైల్వే సూచించింది.

అదనపు కోచ్‌లు..

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి.. 16 రైళ్లకు అదనపు కోచ్‌లు పెంచింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

1. రైలు నెంబర్‌ 58506 విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ జ‌త చేస్తారు.

2. రైలు నెంబ‌ర్‌ 58505 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ జ‌త చేస్తారు.

3. రైలు నెంబ‌ర్ 18463 భువనేశ్వర్-కెఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్ జ‌త చేస్తారు.

4. రైలు నెంబ‌ర్ 18464 కెఎస్ఆర్ బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 2 నుండి మార్చి 1 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్ జ‌త చేస్తారు.

5. రైలు నెంబ‌ర్ 22879 భువనేశ్వర్-తిరుపతి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 2 నుండి ఫిబ్ర‌వ‌రి 22 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్ జ‌త చేస్తారు.

6. రైలు నెంబ‌ర్ 22880 తిరుపతి - భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 2 నుండి ఫిబ్ర‌వ‌రి 23 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్ జ‌త చేస్తారు.

7. రైలు నెంబ‌ర్ 20809 సంబల్పూర్-నాందేడ్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 2 నుండి ఫిబ్ర‌వ‌రి 22 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

8. రైలు నెంబ‌ర్ 20810 నాందేడ్-సంబల్పూర్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 3 నుండి మార్చి 1 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

9. రైలు నెంబ‌ర్ 08311 సంబల్పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 5 నుండి ఫిబ్ర‌వ‌రి 26 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

10. రైలు నెంబ‌ర్ 08312 ఈరోడ్-సంబల్పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 7 నుండి ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

11. రైలు నెంబ‌ర్‌ 20837 భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

12. రైలు నెంబ‌ర్‌ 20838 జునాగఢ్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 2 నుండి మార్చి 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

13. రైలు నెంబ‌ర్ 22883 పూరీ-యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 7 నుండి ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ కోచ్‌లు జ‌త చేస్తారు.

14. రైలు నెంబ‌ర్ 22884 యశ్వంత్‌పూర్-పూరి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 8 నుండి మార్చి 1 వరకు ఒక థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ కోచ్‌లు జ‌త చేస్తారు.

15. రైలు నెంబ‌ర్ 18447 భువనేశ్వర్-జగ్దల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

16. రైలు నెంబ‌ర్ 18448 జగదల్‌పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్ర‌వ‌రి 2 నుండి మార్చి 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు జ‌త చేస్తారు.

దారి మ‌ళ్లింపు ..

సంబల్పూర్ రైల్వే స్టేషన్ వద్ద యార్డ్ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా.. రెండు రైళ్లను సంబల్పూర్ రైల్వే స్టేషన్‌ను తాకకుండా మళ్లించిన మార్గంలో నడుస్తాయి. రైలు నెంబ‌ర్ 20808 అమృత్‌స‌ర్‌-విశాఖపట్నం ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ సంబల్పూర్ స్టేషన్‌ను తాకకుండా ఫిబ్ర‌వ‌రి 5 నుండి ఏప్రిల్ 30 వరకు అమృత్‌స‌ర్‌ నుండి బుధ, శని, ఆదివారాల్లో రైలు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. రైలు నంబర్ 20807 విశాఖపట్నం-అమృత్‌సర్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ సంబల్పూర్ స్టేషన్‌ను తాకకుండా ఫిబ్ర‌వ‌రి 7 నుండి ఏప్రిల్ 29 వరకు విశాఖ‌ప‌ట్నం నుండి మంగళ, శుక్ర, శనివారాల్లో రైలు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner