Jaguar Kumar Cheetah : ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. అనాథలైన తెలుగు డాక్టర్ చిరుతలు-india doctor appeals to govt to rescue his pet jaguar and panther from ukraine ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  India Doctor Appeals To Govt To Rescue His Pet Jaguar And Panther From Ukraine

Jaguar Kumar Cheetah : ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. అనాథలైన తెలుగు డాక్టర్ చిరుతలు

Anand Sai HT Telugu
Oct 05, 2022 08:33 PM IST

Ukraine War Effect : ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం చాలా ప్రభావం చూపించింది. ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు రెండు చిరుతలు కూడా అనాథలయ్యాయి. వాటిని తన వెంట తీసుకెళ్లలేక.. వాటి గురించే ఆలోచిస్తూ మదనపడుతున్నాడు ఓ తెలుగు డాక్టర్.

తెలుగు డాక్టర్ గిరికుమార్
తెలుగు డాక్టర్ గిరికుమార్

ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) ఎంతో ప్రభావం చూపించింది. తెలుగు డాక్టర్ గిరికుమార్ పేరు కూడా అదే స్థాయిలో వినిపించింది. అయితే తాజాగా మరోసారి గిరికుమార్ పేరు మళ్లీ వినిపిస్తోంది. కారణం తాను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న చిరుతలు అతని వెంట లేవు. వాటి గురించే ఆలోచిస్తూ.. భారత ప్రభుత్వానికి(Indian Govt) విజ్ఞప్తి చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన గిరికుమార్ పాటిల్ మెడిసిన్(Medicine) చదివేందుకు 2007లో ఉక్రెయిన్​కి వెళ్లాడు. వైద్య విద్య పూర్తయిన తర్వాత అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆర్థోపెడిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే జంతువులంటే గిరికుమార్​కు చాలా ఇష్టం. ఓ జూలో గాయపడిన జాగ్వార్‌ను అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నాడు. దానికి ‘యాశా’ అని పేరు పెట్టాడు. తాను ఉండే ఇంట్లోనే పెంచుకునేవాడు. యాశాకి తోడు కోసం ఓ బ్లాక్‌ పాంథర్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది.

కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితులు మారిపోయాయి. రష్యా బాంబుల దాడితో అక్కడి పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారు అయ్యాయి. అయితే గిరికుమార్ మాత్రం.. తన పెంపుడు జంతువులను వదిలేసి రాలేనని తేల్చి చెప్పాడు. తన ఇంటి కింద ఉన్న ఓ బంకర్‌లో భయంభయంగా కాలం వెళ్లదీశాడు. అయితే కొన్ని రోజులకు డబ్బులు అయిపోయాయి. వాటికి తిండిపెట్టలేని పరిస్థితి వచ్చింది.

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం తర్వాత అతడు పనిచేస్తున్న ఆసుపత్రి మూసివేశారు. తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా మారింది. వాటిని ఓ రైతు(Farmers) వద్ద విడిచిపెట్టి ఉద్యోగం వెతుక్కుంటూ పోలాండ్‌కు వెళ్లాడు. యుద్ద సమయంలో తన బంగారం, భూమి, ఇల్లు, 2 అపార్ట్‌మెంట్‌లు, కార్లు, ఒక బైక్‌ను విక్రయించి వాటికి బతుకునిచ్చాడు. వాటితో ఇండియా రావాలని చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. వాటి కోసం షెల్టర్‌ను నిర్మించాడు. పెంపుడు జంతువులకు ఆహారం ఇచ్చేందుకు డబ్బు లేకపోవడంతో డాక్టర్ పాటిల్ ఉద్యోగం కోసం పోలాండ్(Poland) వెళ్లాల్సి వచ్చింది.

పోలాండ్‌కు వెళ్లే టైమ్ లో సరిహద్దు దాటుతుండగా రష్యా(Russia) ఆర్మీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు బందీగా పెట్టుకున్నారు. 'నా కళ్లకు గంతలు కట్టి మూడు రోజులు చీకటి గదిలో ఉంచారు. నన్ను గూఢచారిగా అనుమానించారు. నా పరిస్థితిని వివరించాను. నా యూట్యూబ్ ఛానెల్‌(Youtube Channel)ని వారికి చూపించినా వెళ్లనివ్వలేదు. నా సర్టిఫికేట్స్ అన్నీ.. స్వాధీనం చేసుకున్నారు.' అని గిరికుమార్ చెప్పుకొచ్చాడు.

సెప్టెంబర్ 14న అతను పోలాండ్ చేరుకున్నాడు. సరిహద్దు దాటాక శరణార్థులపై చాలా సానుభూతితో ఉన్నారు. తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకే ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. పెంపుడు పులుల లుహాన్స్క్‌లోని రైతు వద్ద వదిలిపెట్టాడు. ప్రస్తుతం పోలాండ్‌ రాజధాని వార్సాలో ఆశ్రయం పొందుతున్నాడు డాక్టర్. రైతుకు ఫోన్‌ చేస్తూ వాటి బాగోగులను తెలుసుకునే వాడు. ఇంటర్నెట్‌ సేవలు క్లోజ్ చేయడంతో వాటిని చూసే అవకాశం లేకుండా పోయింది. తన పులులను ఎలాగైనా రక్షించుకోవాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన పెంపుడు పులులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

IPL_Entry_Point