Family Suicide: అనకాపల్లిలో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
Family Suicide: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆర్ధిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
అనకాపల్లిలో కుటుంబం ఆత్మహత్య
Family Suicide: అనకాపల్లి జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్ధిక ఇబ్బందులతో స్వర్ణకారుడి కుటుంబ సైనేడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులతో దంపతులతో పాటు వారి ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
స్వర్ణకారుడిగా పనిచేస్తున్న శివరామకృష్ణ, మాధవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. గురువారం ఇంట్లో సైనేడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులతో పాటు వారి కుమార్తెలు వైష్ణవి, కుసుమ ప్రియ, లక్ష్మీలు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు.