AP TG Weather Updates : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ 2 రోజులు వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ
ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో… మరో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఉండగా... మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి... వర్షాలు కురుస్తున్నాయి. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో... ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి.
అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతాయి. లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ జిల్లాల్లో చూస్తే ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు పడుతాయి. కొన్నిచోట్లు ఉరుమలుు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురువొచ్చు. గాలివేగం గంటకు 30 - 40 కిమీ వేగం వరకు ఉండొచ్చు. ఇక రాబోయే 4 రోజుల్లో రాయలసీమలో గరిష్ణ ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది.
పెరుగుతున్న ఎండ తీవ్రత…
మరోవైపు ఏపీలో ఎండ తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో 43.7°C రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. 119 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం 14 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాలులు వీచాయి.
తెలంగాణలో వర్షాలు - ఎల్లో హెచ్చరికలు:
తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది. ఇవాళ తెలంగాణోలని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహూబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (ఏప్రిల్ 14) కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహహబూబాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత కొన్నిచోట్ల తేలికపాటి జల్లలు పడొచ్చు.