AP TS Weather : ఈ నెల 19 నుంచి వర్షాలు - రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన
IMD Latest Updates: ఏపీకి చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. రుతుపవనాలకు సంబంధించి కూడా కీలక అప్డేట్ ఇచ్చింది.
AP Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 21 మధ్య నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైయస్సార్, చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక అటు తెలంగాణ లో కూడా కూడా ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన చేసింది.
నెల్లూరు తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు Andhra Pradesh Weatherman పేర్కొంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని తీర ప్రాంతల్లో మరికొద్ది గంటల్లో చినుకులు, తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతానికి తూర్పు రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలో ఆకాశం పూర్తి స్ధాయిలో మేఘావృతం అయ్యి ఉంది. కానీ రాత్రి సమయం వెళ్లేసరికి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ వర్షాలు జోరందుకుంటాయని వివరించింది. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో అధిక వర్షపాతం నమోదవ్వనుంది.
నేడు రుతుపవనాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోకి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంది తెలిపింది.రాత్రి సమయాల్లో అనంతపురం, సత్యసాయి, నంధ్యాల, కడప, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్.టీ.ఆర్., పల్నాడు, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారమరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అంతగా ఉండవని.. కాబట్టి వేడి అనేది ఎక్కువగా ఉంటుందని తెలిపింది.