AP TS Weather : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు - ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్!
Weather Updates of Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మరింతగా ముదురుతున్నాయి. ఇవాళ ఏపీలోని పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇక్కడ కూడా వడగాల్పులు షురూ కానున్నాయి.
AP Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు(AP Weather Update) దంచికొడుతున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల స్థాయి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 50 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఇక నిన్న(మార్చి 29) 31 మండలాల్లో వడగాల్పులు... కడప జిల్లా ముద్దనూరు లో తీవ్ర వడగాల్పు వీచినట్లు వివరించారు.ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కింద ఇచ్చిన పీడీఎఫ్ లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అయిన ఏపీలోని జిల్లాలు, మండలాల వివరాలను చూడొచ్చు..
తెలంగాణలో మండుతున్న ఎండలు - ఎల్లో హెచ్చరికలు
Temperatures in Telangana : మరోవైపు తెలంగాణలో ఎండలు(Temperatures in Telangana) దంచికొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరితంగా పెరగనున్నాయి. దాదాపు రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగానూ పొడి వాతావరణమే ఉంటుందని తాజా బులిటెన్ పేర్కొంది. అయితే ఏప్రిల్ 1 తర్వాత రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత ఉంటుందని తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలను జారీ చేసింది.
- ఏప్రిల్ 1వ తేదీన వడగాల్పులు వీచే అవకాశం - ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిలాల్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
- ఏప్రిల్ 2 : ఈ తేదీన కూడా వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.- ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, కామారెడ్డి