IIT Tirupathi Admissions: ఐఐటి తిరుపతిలో పిహెచ్‌డి, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
IIT Tirupathi Admissions: ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో పిహెచ్‌డి, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

IIT Tirupathi Admissions: తిరుపతిలోని ఐఐటీ క్యాంపస్‌లో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో పిహెచ్‌డి Phd ప్రవేశాలతో పాటు పీజీ PG కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ Social Science విభాగాల్లో పిహెచ్‌డి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
పీజీ PG కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఐఐటీలో ఎంటెక్ Mtech ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కోర్సులో కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
మాస్టర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 13నుంచి ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంటెక్, మాస్టర్ ఆఫ పబ్లిక్ పాలసీ కోర్సులకు మార్చి 20వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలు www.iittp.ac.in/admissions లో అందుబాటులో ఉంటాయి.
పిహెచ్‌డిలో, రీసెర్చ్ విభాగాల్లో కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీలో ఫిజకల్ కెమిస్ట్రీ, కంప్యూటషనల్ అండ్ థిరిటికల్ కెమిస్ట్రీ, థిరిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గనిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ ఇనార్గనిక్ కెమిస్ట్రీ విభాగాలు ఉన్నాయి.
సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో పలు అనుబంధ విభాగాలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఆల్గారిథమ్ అండ్ అర్కిటెక్చర్, లెర్నింగ్ సిస్టమ్స్, ఇంటెలిజెంట్ నెట్‌వర్క్స్ ఉన్నాయి.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సైస్‌లో ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఫిలాసఫీ విభాగాలు ఉన్నాయి.
మ్యాథ్స్ అండ్ స్టాటస్టిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రీసెర్చ్ విభాగంలో కూడా వేర్వేరు విభాగాల్లో ప్రవేశాలకు అర్హతలు, ఏరియా వారీగా కోర్సులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం