Ignou Admissions : ఇగ్నో విశాఖపట్నం క్యాంపస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం, ఇలా దరఖాస్తు చేసుకోండి
Ignou Admissions : ఇగ్నో విశాఖ క్యాంపస్ లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ. డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.
Ignou Admissions : ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) విశాఖపట్నం క్యాంపస్‌లో 2025 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం జనవరి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ గోనిపాటి ధర్మారావు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాలని కోరారు.
ఆన్‌లైన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ. డిప్లమా, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 31గా నిర్ణయించామన్నారు. విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం పరిధిలోని 11 జిల్లాల విద్యార్థులు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకుని కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, సెమిస్టర్ విధానం లో చదివే విద్యార్థులు రీ-రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా జనవరి 31 వరకు చెల్లించవచ్చని అన్నారు.
ఇతర వివరాలకు ఇగ్నో అధికారిక వెబ్ సైట్ www.ignou.ac.inని సంప్రదించవచ్చని తెలిపారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉషోదయ కూడలిలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని సంపద్రించవచ్చని సూచించారు.
ఏఏ కోర్సులు ?
ఇగ్నో జనవరి-2025 సెషన్‌లో దాదాపు 300 గ్రూపుల వరకు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీ.జీ డిప్లమా, డిప్లమాల్లో వివిధ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిల్లో తమకు నచ్చిన గ్రూప్‌ను ఎంచుకోవచ్చు. గ్రూప్‌ను బట్టీ ఫీజులు ఉంటాయి.
ఇగ్నో అడ్మిషన్ దరఖాస్తు విధానం
Step 1 : ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ ignouadmission.samarth.edu.in పై క్లిక్ చేయండి.
Step 2 : స్క్రీన్‌పై వచ్చే 'ఇంగ్నో రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయండి
Step 3 : అవసరమైన వ్యక్తిగత, ప్రాథమిక విద్యా వివరాలను ఇవ్వండి
Step 4 : యూజర్ నేమ్‌ను సెలెక్ట్ చేసుకుని, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
Step 5 : ఇగ్నో 2025 దరఖాస్తును చేసేందుకు లాగిన్ అవ్వండి
Step 6 : సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.
Step 5 : ఆన్ లైన్ ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం