CBN On Liquor: ఎమ్మార్పీ మించితే ఐదు లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయాలన్న సీఎం
CBN On Liquor: ఏపీలో మద్యం విక్రయాలను ఎమ్మార్పీకి మించితే రూ.5లక్షలు జరిమానా విధించాలని, రెండోసారి పట్టుబడితే లైసెన్సులు రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. బెల్టు షాపుల్లో విక్రయించినా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
CBN On Liquor: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించా లని రెండోసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం, ఇసుకపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కడా ఉండకూడదని, బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాలకు మొదటిసారి రూ.5 లక్షలు జరిమానా విధించాలని రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుంచి తరలించే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రతి మద్యం షాపులో సీసీ కెమేరాలు ఉండాలి. ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబ రు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి షాపులో మద్యం ధరలను ప్రదర్శించాలని సూచించారు.
ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో ఒక్క లారీ ఇసుక కూడా వెళ్లకూడదని ఇసుకలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధి త అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు.
మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సిఎం ఆదేశించారు. ఎంఆర్పికి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సిఎం ఆదేశించారు.
బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి సారి తప్పు చేస్తే రూ. 5 లక్షలు అపరాధ రుసుము విధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని సిఎం ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలని NDPL రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అదే విధంగా ID (illicitly distilled) లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి షాపులో సిసి కెమేరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచించారు.
ఇసుక లభ్యతపై ఆరా…
రాష్ట్రంలో ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై తాజా పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత పెంచాలని, అన్ని రీచ్ ల నుంచి ఇసుక సులభంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు.
పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటగా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇసుక విషయంలో తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని...దాన్ని క్షేత్ర స్థాయి వరకు సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు స్పష్టం చేశారు.