Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వదినమ్మ సురేఖ సూపర్ గిఫ్ట్, వీడియో పోస్టు చేసిన చిరంజీవి!
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆయన సోదరుడు చిరంజీవి, వదినమ్మ సురేఖ సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ వీడియోను చిరంజీవి ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఆయన వదినమ్మ సురేఖ సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయంతో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టింది. కూటమిలో కీలకంగా వ్యవహరించిన జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కూటమి ప్రభుత్వంలో జనసేనకు మూడు కేబినెట్ మంత్రులు కేటాయించారు. పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలకమైన పంచాయతీ రాజ్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు పవన్ కల్యాణ్ కు ఆయన అన్నయ్య చిరంజీవి, వదినమ్మ సురేఖ ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్టు చేశారు. కల్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి అని పోస్టు పెట్టారు. ఈ వీడియోలో పవన్ వదినమ్మ సురేఖ ఓ బహుమతి అందించారు. మాంట్ బ్లాంక్ పెన్నును చిరంజీవి, సురేఖ... పవన్ కల్యాణ్ కు అందించారు.
చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్
"తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తావని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ... వదిన, అన్నయ్య" అంటూ చిరంజీవి ఆ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కు చిరంజీవి, సురేఖ ఈ బహుమతి అందించారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పెన్ను బహుమతి అందించారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కోరారు.
పవన్ విజయంలో కుటుంబం కీలక పాత్ర
ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కల్యాణ్ కుటుంబంతో సహా తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ మెగా కుటుంబం మొత్తం ఘనస్వాగతం పలికింది. ఈ వీడియో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో పోస్టు చేయగా తెగ వైరల్ అయ్యింది. పవన్ విజయాన్ని మెగా కుటుంబం ఎంతగానో ఆస్వాదించింది. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ కు కుటుంబం అండగా నిలిచింది. తన అన్నయ్య చిరంజీవి మద్దతు పలుకుతూ వీడియో విడుదల చేయగా...రామ్ చరణ్, నాగబాబు కుటుంబం, సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ ... ఇతర కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ప్రమాణ స్వీకారం రోజున పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవి కాళ్లు మొక్కడం, అనంతరం ప్రధాని మోదీ చిరంజీవి, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రజలకు అభివాదం చేయడం ఎంతగానో ఆకట్టుకున్నాయి. పదేళ్ల పాటు పవన్ కల్యాణ్ పడిన కష్టాలకు, అవమానాలకు ఇన్నాళ్లు గుర్తింపు లభించిందని జనసేన నాయకులు అంటున్నారు.
సంబంధిత కథనం