Guntur Murder: గుంటూరు జిల్లాలో ఘోరం, వివాహేతర సంబంధంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త-husband killed his wife and committed suicide for extra marital affair ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Murder: గుంటూరు జిల్లాలో ఘోరం, వివాహేతర సంబంధంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

Guntur Murder: గుంటూరు జిల్లాలో ఘోరం, వివాహేతర సంబంధంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

HT Telugu Desk HT Telugu

Guntur Murder: గుంటూరు జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో భ‌ర్త ఆమెను హ‌త‌మార్చాడు. ఆ త‌రువాత భ‌ర్త కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటన దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో జరిగింది.

గుంటూరు జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య

Guntur Murder: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో జరిగింది. త‌న భార్యను తానే హ‌త్య చేసిన‌ట్లు సూసైడ్ నోట్‌లో రాసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ ఘట‌న గుంటూరు జిల్లా దుగ్గిరాల‌ మండ‌లం రేవేంద్ర‌పాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దుగ్గిరాల మండ‌లం రేవేంద్ర‌పాడుకు చెందిన‌ బొక్కినాల సురేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా హైద‌రాబాద్‌లో ప‌ని చేస్తున్నాడు. ఆరు నెల‌ల క్రిత‌మే త‌న భార్య‌ శ్రావ‌ణితో క‌లిసి రేవేంద్ర‌పాడుకు మ‌కాం మార్చాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.

సురేష్ రాసిన సూసైడ్ నోట్ ప్రకారం...తాను ఎంతో ఇష్ట‌ప‌డినా త‌న భార్య శ్రావ‌ణి మాత్రం వేరే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌రుచుకుందని ఆరోపించాడు. వారి వివాహేత‌ర సంబంధానికి తాను అడ్డుగా ఉన్నాన‌ని, త‌న‌ను చంపాల‌ని చూశారు. అందుకు త‌న‌కు నిద్ర‌మాత్ర‌లు కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వాటిని కూడా కొనుగోలు చేశారని తెలిపాడు. ఫోన్ ఉంటే అత‌నితోనే మాట్లాడుతుంద‌ని తెలిసి త‌న భార్య ఫోన్‌ను ప‌గ‌ల‌గొట్టాన‌ని, అయినా ఇత‌రుల ఫోన్‌తో వివాహేత‌ర సంబంధం ఉన్న వ్య‌క్తితో ఆమె మాట్లాడేద‌ని సురేష్ త‌న సూసైడ్ నోట్‌లో రాశాడు.

వైవాహిక జీవితం, తన బాధ‌లు, త‌మ మ‌ధ్య నెల‌కొన్న గొడ‌వ‌లో కూడిన రెండు పేజీల సూసైడ్ నోట్ రాశాడ‌ని పోలీసులు తెలిపారు. ఈనెల 25వ తేదీన రాత్రి భార్య‌ను హ‌త‌మార్చి, 26వ తేదీన సురేష్ ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే భార్య‌ను సురేష్ ఎలా చంపాడనేది పోస్టుమార్టం నివేదిక‌లో స్ప‌ష్టం అవుతుంద‌ని అన్నారు. ఆమెను హ‌త‌మార్చిన త‌రువాత దోమ‌ల బ్యాట్‌తో కొట్టాడ‌ని, అది కూడా విరిగిపోయింద‌ని పోలీసులు చెబుతున్నారు.

అయితే త‌న కొడుకు చ‌నిపోవడానికి కార‌ణం కోడ‌లు, ఆమెతో సంబంధం ఉన్న వ్య‌క్తేన‌ని సురేష్ తండ్రి అబ్ర‌హం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శ్రావ‌ణి చ‌నిపోవ‌డంతో ఆమెతో వివాహేత‌ర సంబంధం ఉన్న వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు అయింది. దుగ్గిరాల ఎస్ఐ వెంక‌ట ర‌వి, సిబ్బంది గురువారం రాత్రి మృత‌దేహాల‌ను ఎయిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతదేహాలకు శుక్ర‌వారం పోస్టుమార్టం చేయ‌నున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని గుంటూరు ఎస్పీ స‌తీష్ కుమార్ తెలిపారు. సురేష్‌, శ్రావ‌ణి కుటుంబాల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం