Birth Certificate in AP: బర్త్ సర్టిఫికేట్ లేదా..? అయితే ఇలా పొందండి
Birth Certificate in Andhrapradesh : బర్త్ సర్టిఫికెట్ లేదని ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు చాలా సింపుల్ గా ఈ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు నింపి ఎంపీడీవో లేదా తహసీల్దార్‌తో సంతకం చేయించాలి. ఈ అప్లికేషన్‌ను సచివాలయంలో అందజేసి సర్టిఫికెట్ పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
మీరు ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోనట్టయితే ఇప్పుడు సులువుగా పొందే ప్రక్రియ ఇక్కడ చూడొచ్చు. బర్త్ సర్టిఫికేట్ లేనివారు స్వీయ దరఖాస్తు ఫారం నింపి ఎంపీడీవో లేదా తహసీల్దార్ సంతకం చేయించి ఆ అప్లికేషన్ ను సచివాలయంలో సబ్మిట్ చేసి బర్త్ సర్టిఫికెట్ పొందవచ్చు.
బర్త్ సర్టిఫికెట్ పొందే ప్రక్రియ
తొలుత సచివాలయానికి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి. ఆ నాన్ అవైలబిలిటీ ధ్రువీకరణ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి. తరువాత విద్యార్థి స్టడీ లేదా ఎస్ఎస్‌సీ మార్కుల మెమో, విద్యార్థి తండ్రి, తల్లి ఆధార్ కార్డులు, నోటరీతో పాటుగా డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యపు జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ బర్త్) చేయించుకోవాలి.
ఆ పత్రాలకు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నింటినీ కలిపి విలేజ్ రెవ్యెన్యూ అధికారి (విఆర్వో)కి సమర్పించాలి. వీఆర్వో సంతకం తరవాత అక్కడ నుంచి ఆర్ఐకి ఫైల్ వెళ్తుంది. ఆర్ఐ సంతకం తరువాత అక్కడ నుండి ఎమ్మార్వోకి ఫైల్ చేరుతుంది. ఎమ్మార్వో సంతకం తరువాత అక్కడ నుండి ఆర్‌డీవోకి ఫైల్ వెళ్తుంది.
ఆర్‌డీవో ఆమోదం తరువాత సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, లేదా మీ దగ్గరలోని మీసేవ సెంటర్‌లో ప్రొసీడింగ్ ప్రింట్ పొందవచ్చు. ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీకి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రకంగా బర్త్ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ పొందని వారు ఈ ప్రక్రియ ద్వారా బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు.
బర్త్ సర్టిఫికెట్‌తో ఉపయోగాలు
బర్త్ సర్టిఫికేట్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆధార్ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్‌తో కొత్తగా ఆధార్ తీసుకోవచ్చు. ఆధార్ ఇంత వరకు తీసుకోనివారికి ఇప్పుడు తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు ఆధార్‌ను అప్డేట్ చేసుకోవచ్చును. అలాగే ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవడానికి కూడా బర్త్ సర్టిఫికేట్ ఉపయోగపడుతోంది. పాస్‌పోర్టు, వీసా తదితర అవసరాలకూ ఉపయోగపడుతుంది.