కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేశారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-how to check new ration card application status in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేశారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేశారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొత్త రేషన్ కార్డు, రేషన్ కార్డుల్లో మార్పు చేర్పుల కోసం చేసుకున్న మీ దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి. ఎవరి వద్ద పెండింగ్ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేశారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే మొత్తం రేషన్ కార్డులకు సంబంధించి 7 సర్వీసుల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు, రేషన్ కార్డుల్లో సభ్యుల జోడింపు, తొలగింపు, చిరునామా మార్పులు, ఆధార్ సీడింగ్... కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకూ వచ్చిందో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ప్రభుత్వం నుంచి మెసేజ్

ఏపీలో మే 7 నుంచి 7 రకాల రేషన్ కార్డ్ సర్వీసులను తిరిగి ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత, రసీదును అక్కడే పొందవచ్చు. అలాగే దరఖాస్తుదారుడు మొబైల్ కు ఏపీ ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది. ఇందులో అప్లికేషన్ నెంబర్(T123456789), ట్రాన్ జెక్షన్ నంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

గ్రామ, వార్డు సచివాలయంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాక...ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ లెవల్స్ లో పరిశీలన చేస్తారు. ఈ మూడు దశలు పూర్తి అయ్యేందుకు మొత్తం 21 రోజుల సమయం పడుతుంది.

రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

  1. ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ https://vswsonline.ap.gov.in/ ను విజిట్ చేయండి
  2. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది.
  3. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయండి.
  4. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
  5. రేషన్ కార్డు ఏ స్టేజీలో ఉందో, ఎవరి వద్ద పెండింగ్ లో స్టేటస్ చూపిస్తుంది.
  6. మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలియజేస్తారు.

రేషన్ కార్డు దరఖాస్తుదారుల అర్హత ప్రమాణాలు, అవసరమైన డాక్యుమెంట్లు:

1. కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు

  • అర్హతలు, అవసరమైన పత్రాలు
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.2 లక్షలకు లోపు ఉండాలి
  • గ్రామ, వార్డు సచివాలయ హౌస్ హోల్డ్ డేటాబేస్ లో నమోదు అయ్యి ఉండాలి. వారిలో ఎవరికి రైస్ కార్డ్ ఉండకూడదు.
  • కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు

2. సభ్యులను చేర్చడం

  • వివాహం లేదా జననం ద్వారా కార్డులో కుటుంబ సభ్యులను జోడించవచ్చు.
  • వివాహ ధృవీకరణ పత్రం, వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో
  • జననం ధృవీకరణ పత్రం
  • చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు
  • ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
  • ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డు

3. రైస్ కార్డ్ విభజన

  • ఒకే కార్డులో రెండు కుటుంబాలు ఉన్నప్పుడు (కనీసం 4 సభ్యులు చొప్పున విభజన)
  • సంబంధిత సభ్యుల ఆధార్ కార్డులు
  • వివాహ ధృవీకరణ పత్రం
  • ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
  • ప్రస్తుత రైస్ కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డు

4. సభ్యుడిని తొలిగించడం

  • సభ్యుడు మరణించినప్పుడు
  • మరణ ధృవీకరణ పత్రం
  • సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు
  • రైస్ కార్డ్
  • రైస్ కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డు

5. చిరునామా మార్పు

  • ఆధార్ కార్డ్‌లో కొత్త అడ్రస్ నమోదై ఉండాలి
  • సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు
  • రైస్ కార్డ్

6. ఆధార్ సీడింగ్ సవరణ

  • రైస్ కార్డ్‌లో సభ్యుడి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు ఈ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సంబంధిత సభ్యుడి సరైన ఆధార్ కార్డు
  • రైస్ కార్డ్
  • రైస్ కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డు

7. రైస్ కార్డు సరెండర్

  • సభ్యుల ఆధార్ కార్డులు
  • రైస్ కార్డు

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం