Andhra On BRS : కేసీఆర్ జాతీయ పార్టీ.. ఏపీలో రియాక్షన్ ఏంటి?-how andhra pradesh react on kcr national party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  How Andhra Pradesh React On Kcr National Party

Andhra On BRS : కేసీఆర్ జాతీయ పార్టీ.. ఏపీలో రియాక్షన్ ఏంటి?

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 07:06 PM IST

KCR National Politics : సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు?

ఏపీలో కేసీఆర్ హోర్డింగ్
ఏపీలో కేసీఆర్ హోర్డింగ్

జాతీయ రాజకీయాలపై కేసీఆర్(KCR) పూర్తిస్తాయిలో ఫోకస్ పెట్టారు. టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(BRS)గా ప్రకటించారు. దీనిపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో తెలుగు రాష్ట్రంలోనూ.. కొంతమంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మరికొంతమంది వ్యతిరేకిస్తు్న్నారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ప్రకటించడంతో అభినందనలు తెలుపుతూ విజయవాడ(Vijayawada)లోని వారధి ప్రాంతంలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్‌ పేరిట భారీ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. జయహో కేసీఆర్ నినాదాలతో పాటు ఆయన చిత్రపటం, కేటీఆర్ చిత్రాలతో కూడిన బీఆర్ఎస్ హోర్డింగ్ లు వెలిశాయి.విజయవాడ నగరంలో వారధి సెంటర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

టీఆర్‌ఎస్‌కు బీఆర్‌ఎస్‌గా నామకరణం చేసినంత మాత్రన.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలపై ప్రభావం ఉండదని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పలువురు రాజకీయ నాయకులు తమ సొంత ఎజెండాలతో దేశంలో రాజకీయ పార్టీలను ప్రారంభించారని చెప్పారు. ఏపీ ప్రయోజనాలను పరిరక్షించడమే వైఎస్సార్‌సీపీ ఎజెండా అని, రాబోయే 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) సీఎంగా కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకే జగన్‌పై తెలంగాణ(Telangana) మంత్రులు విమర్శలు చేస్తున్నారని ఏపీ మంత్రి తప్పుబట్టారు. ‘వైఎస్‌ఆర్‌సీపీ ఏ రాజకీయ పార్టీకి భయపడేది లేదని, దేశంలోని ఏ రాష్ట్రం కూడా తమ ప్రభుత్వంలా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని అన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో జాతీయ రాజకీయ పార్టీలకు స్థానం లేదని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు స్పష్టం చేశారు. అశాస్త్రీయంగా విభజన చేయడం వల్ల ఏపీ నష్టపోయిందని ఆయన అన్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై ప్రకటనపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును స్పందన అడిగారు. ఓ చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి ఆయన వెళ్లిపోయారు.

IPL_Entry_Point