Minor Gang Rape: కృష్ణా జిల్లాలో ఘోరం.. మైనర్‌ బాలికను బంధించి గ్యాంగ్ రేప్, ఏడుగురిని గుర్తించిన పోలీసులు-horrific incident in krishna district a minor girl gang raped police identified seven people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minor Gang Rape: కృష్ణా జిల్లాలో ఘోరం.. మైనర్‌ బాలికను బంధించి గ్యాంగ్ రేప్, ఏడుగురిని గుర్తించిన పోలీసులు

Minor Gang Rape: కృష్ణా జిల్లాలో ఘోరం.. మైనర్‌ బాలికను బంధించి గ్యాంగ్ రేప్, ఏడుగురిని గుర్తించిన పోలీసులు

Sarath Chandra.B HT Telugu

Minor Gang Rape: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్నేహితురాలి ఇంటికి వెళ్ళిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆటో డ్రైవర్ చొరవతో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుల్ని గుర్తించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మైనర్లు కూడా ఉన్నారు.

కృష్ణా జిల్లాలో మైనర్‌ బాలికపై ఏడుగురి అత్యాచారం...

Minor Gang Rape: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికను బంధించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో బంధించి ఆమెపై అత్యాచారం చేశారు. చివరకు విజయవాడలో బాలికను వదిలేయడంతో ఓ ఆటో డ్రైవర్ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి కూడా ఉన్నట్టు గుర్తించారు. 

ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక, ఆమె ఇంటి పక్కన ఉండే యువతితో కలిసి మార్చి 9న గన్నవరం మండలం వీరపనేని గూడెం వచ్చింది. ఈ క్రమంలో వీరపనేని గూడెంలోని యువతి ఇంట్లో గొడవలు జరిగాయి. గొడవకు బాధిత బాలిక కారణమంటూ యువతి తల్లి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక మార్చి 13న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

బాలికను అపహరించి…

వీరపనేని గూడెం ఊరి బయట మద్యం సేవిస్తున్న మైనర్ బాలుడు, రజాక్‌ అనే యువకుడు ఆమెతో మాటలు కలిపాడు. ఆమె గురించి తెలుసుకుని జి. కొండూరులో మీ ఇంటికి తీసుకు వెళ్తానని నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఆమెను ఎక్కించుకుని కొంత దూరం తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు.

ఆ తర్వాత ఆమెను జి.కొండూరు తీసుకువెళ్లకుండా అదే గ్రామానికి చెందిన సిద్ధు, జితేంద్ర వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను కేసరపల్లికి చెందిన అనిల్, హర్షవర్ధన్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వారు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆమెను మార్చి 17వ తేదీ రాత్రి ఆటోలో విజయవాడ మాచవరం తీసుకొచ్చి వదిలేశారు

ఆటో డ్రైవర్‌ చొరవతో వెలుగులోకి…

బాలికను విజయవాడ మాచవరం ప్రాంతంలో వదిలిన తర్వాత తాను ఎక్కడ ఉందో తెలియని స్థితిలో ఉన్న బాలిక ఓ ఆటో డ్రైవర్‌ను తనను విజయవాడ వెళ్లాలని కోరింది. ఆమె విజయవాడలోనే ఉందని చెప్పి, ఆరా తీశాడు. దీంతో జరిగిన ఘోరాన్ని ఆటోడ్రైవర్‌కు వివరించింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆటోడ్రైవర్ బాలికను నేరుగా మాచవరం పీఎస్‌కు తీసుకెళ్లాడు. బాలిక అప్పటికే నీరసించి పోయి ఉండటంతో వెంటనే ఆమెకు చికిత్స అందించారు.

అప్పటికే వీరపనేని గూడెంలో బాలిక కనిపించడం లేదని పోలీస్ కేసు నమోదైంది. దీనిపై ఆత్కూరు పీఎస్‌లో కేసు నమోదైంది. విజయవాడ మాచవరంలో బాలికను పోలీసులు గుర్తించినట్టు తెలియడంతో ఆత్కూరు పోలీసులుఆమెను ఆసుపత్రికి తరలించారు. వీరపనేని గూడెం నుంచి వెళ్లిపోయిన బాలిక జికొండూరు వెళ్లి ఉంటుందని భావించారు. ఆ తర్వాత ఆమె కనిపించడం లేదని ఆలస్యంగా గుర్తించారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు

బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్త ముమ్మరం చేసి బాలికను అపహరించిన వారిని గుర్తించారు. కొందరిని అదుపు లోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పలు మార్లు ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

వీరపనేనిగూడేనికి చెందిన బాణావతు లక్ష్మణ జితేంద్ర, పరసా సంజయ్, మైనర్‌ బాలుడు, కేసరపల్లికి చెందిన కొండేటి అనిల్‌కుమార్, తేలప్రోలుకు చెందిన పగడాల హర్షవర్ధన్, మరో ఇద్దరు ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. బాలికను మార్చి 13 నుంచి 17 వ తేదీ వరకు ఎక్కడెక్కడ ఉంచారనే దానిపై ఆరా తీస్తున్నారు.

 బాలికను నిర్బంధించిన ప్రదేశాలను కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కేసరపల్లిలోనే నాలుగు రోజుల పాటు బాలికను బంధించి ఉంచారని, బాలిక కోసం గాలిస్తున్నట్టు తెలియడంతో విజయవాడలో వదిలేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. బాలికను తల్లి సమక్షంలో విచారించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. 

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం