Anakapalli Crime: అనకాప‌ల్లి జిల్లాలో ఘోరం... మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక‌దాడి-horrific incident in anakapalle district boy sexually assaults minor after watching porn ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anakapalli Crime: అనకాప‌ల్లి జిల్లాలో ఘోరం... మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక‌దాడి

Anakapalli Crime: అనకాప‌ల్లి జిల్లాలో ఘోరం... మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక‌దాడి

HT Telugu Desk HT Telugu
Jan 13, 2025 09:22 AM IST

Anakapalli Crime: అనకాప‌ల్లి జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఎఫ్ఐఆర్‌ న‌మోదు చేసిన పోలీసులు, బాలిక‌ను విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు తర‌లించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచార‌ణ జ‌రుపుతున్నారు.

అనకాపల్లిలో చిన్నారిపై మైనర్ బాలుడి అత్యాచారం
అనకాపల్లిలో చిన్నారిపై మైనర్ బాలుడి అత్యాచారం

Anakapalli Crime: అనకాపల్లిలో దారుణ ఘటన జరిగింది. చిన్నారిపై మైనర్‌ బాలుడు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘోర‌మైన ఘ‌ట‌న అన‌కాప‌ల్లి జిల్లా య‌ల‌మంచిలి మండ‌లం ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాలిక కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఆ గ్రామంలో జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో 13 ఏళ్ల బాలుడు ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. శ‌నివారం త‌న ఇంటికి స‌మీపంలో ఆడుకుంటున్న బాలిక‌ను స‌మీపంలో ఉన్న డాబాపైకి తీసుకెళ్లి, మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం ఆ చిన్నారిని అక్క‌డే వ‌దిలేసి, ఆ బాలుడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

yearly horoscope entry point

దీంతో చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. అప్ప‌టికే చిన్నారికి తీవ్ర ర‌క్త‌స్రావం అయింది. దీంతో కుటుంబ స‌భ్యులు చిన్నారిని ప్ర‌శ్నించారు. ఏం జ‌రిగిందోన‌ని ఆరా తీశారు. దీంతో ఆ చిన్నారి జ‌రిగిన విష‌యం మొత్తం త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించింది. దీంతో బాలుడు చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి మంద‌లిద్దామ‌ని వెళ్లిన బాలిక కుటుంబ స‌భ్యుల‌పైనే బాలుడి త‌ల్లి ఎదురుదాడికి దిగింది. మీ ఇష్టం వ‌చ్చింది చేసుకోండంటూ నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇచ్చింది.

దీంతో శ‌నివారం రాత్రే య‌ల‌మంచిలి రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌ను బాలిక కుటుంబ స‌భ్యులు ఆశ్ర‌యించారు. అయితే పోలీసులు కేసు న‌మోదు చేయ‌డానికి ఇష్టం ప‌డ‌లేదు. ఎందుకంటే అఘాయిత్యానికి పాల్ప‌డిన బాలుడి త‌ల్లి, బంధువులు రాజ‌కీయ అండ‌దండ‌లు ఉండ‌టంతో పోలీసులు కేసు న‌మోదు చేసేందుకు తాత్సారం చేశారు. దీంతో బాధిత చిన్నారి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను నిల‌దీయ‌డంతో ఆదివారం కేసు న‌మోదు చేశారు. అత్యాచార ఘ‌ట‌న‌పై కేసు న‌మోదులో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

అనంత‌రం బాలిక‌ను విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు త‌ర‌లించారు. ఆమెకు అక్క‌డ వైద్యులు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత‌టి అఘాయిత్యానికి ఎందుకు వ‌డిగ‌ట్టావ‌ని పోలీసులు ప్ర‌శ్నించారు. త‌న త‌ల్లి మొబైల్ ఫోన్‌లో ఓ పోర్న్ వీడియో చేసి తాను ఇలా చేశాన‌ని బాలుడు స‌మాధానం ఇవ్వ‌డంతో పోలీసులు విస్తుపోయారు. ఇలా వివిధ అంశాల‌ను బాలుడు పోలీసుల‌కు తెలిపాడు. బాలుడు చెప్పిన విష‌యాల‌ను పోలీసుల న‌మోదు చేసుకున్నారు.

అయితే మ‌రోవైపు బాధిత కుటుంబాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధర్మ‌శ్రీ ప‌రామ‌ర్శించారు. బాధితుల‌ను బెదిరిస్తున్నార‌ని త‌మ‌కు తెలిసిందని, బాధితుల‌ను బెదిరిస్తే ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత, ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner