Home Guard Reservations : ఏపీలో కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్-home guards will get reservations in police recruitment in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Home Guards Will Get Reservations In Police Recruitment In Andhra Pradesh

Home Guard Reservations : ఏపీలో కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 08:48 AM IST

Home Guard Reservations ఆంధ‌్రప్రదేశ్‌లో చేపడుతున్న కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలీస్‌ నియామక నిబంధనల్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ‌‌లో హోంగార్డులపై ముఖ్యమంత్రి జగన్ వరాలు
ఆంధ్రప్రదేశ‌‌లో హోంగార్డులపై ముఖ్యమంత్రి జగన్ వరాలు

Home Guard Reservations ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ఇకపై హోంగార్డులకు రిజర్వేషన్ వర్తింప చేయనున్నారు. సివిల్‌ కానిస్టేబుళ్ల నియామకంలో 15శాతం, ఏఆర్‌ కానిస్టేబుల్ల నియామకంలో 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకంలో 25శాతం, ఎస్‌ఏఆర్‌సీఏఎల్‌ కానిస్టేబుల్ నియామకాల్లో 25శాతం, కమ్యూనికేషన్ విబాగంలో 10శాతం, ఫిట్టర్‌ ఎలక్ట్రిషియన్ పోస్టుల్లో 5శాతం, మెకానిక్ పోస్టుల్లో 10శాతం, డ్రైవర్ పోస్టుల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఏపీలో పనిచేస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు నియామక ప్రక్రియ నిబంధనల్ని సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్‌- ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్‌ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లను వర్తింప చేయనున్నారు.

కానిస్టేబుల్ నియామకాల్లో సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో హోంగార్డులకు రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, ఫిట్టర్‌ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్‌ కేటగిరీల్లో కేవలం పురుష కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనుండటంతో ఆ విభాగాల భర్తీలో పురుష హోంగార్డులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్‌ నియామకాల్లో కేటగిరీల వారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు.

హోంగార్డులకు రిజర్వేషన్లు వర్తింప చేయడానికి 'ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రూల్స్‌ 1999'కి సవరణ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. కానిస్టేబుల్‌ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడంతో రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. ఏపీలో

పోలీసు కానిస్టేబుల్ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నోటిఫికేషన్‌ విడుదలకు ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో వారికి రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

IPL_Entry_Point