AP High Court: ఏపీ ఐపీఎస్‌ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు-high court grants anticipatory bail to ap ips officers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap High Court: ఏపీ ఐపీఎస్‌ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

AP High Court: ఏపీ ఐపీఎస్‌ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 07, 2025 11:25 AM IST

AP High Court: ముంబై సినీ నటిని వేధింపులకు గురి ఫిర్యాదుపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఏసీపీ, సీఐ, అడ్వకేట్‌ల‌కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

AP High Court: ముంబై సినీ నటిపై వేధింపుల కేసులో విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్‌ కాంతి రాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్‌ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్సార్ ఆంజనేయులును కూడా నిందితుడిగా పేర్కొన్నా ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేయలేదు. మిగిలిన పోలీస్‌ అధికారులకు తాజాగా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

yearly horoscope entry point
Whats_app_banner