కొనసాగుతున్న ద్రోణి - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన-heavy rains likely in some places in andhrapradesh on friday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కొనసాగుతున్న ద్రోణి - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

కొనసాగుతున్న ద్రోణి - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీకి వర్ష సూచన (PTI)

దక్షిణ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ దక్షిణ ఒడిశా నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ,తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం… అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

శుక్రవారం(10-10-25) : అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

గురువారం సాయంత్రం 4 గంటలకు అనకాపల్లిలో 52.2 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక దేశపాత్రునిపాలెంలో 48.5మిమీ, అల్లూరి జిల్లాలోని పాడేరులో 41.7 మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం