బంగాళాఖాతంలో అల్పపీడనం....! ఏపీలో ఈ 3 రోజులు భారీ వర్షాలు-heavy rains likely in andhrapradesh for 3 days imd updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బంగాళాఖాతంలో అల్పపీడనం....! ఏపీలో ఈ 3 రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం....! ఏపీలో ఈ 3 రోజులు భారీ వర్షాలు

ఏపీలో ఈ 3 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణం సంస్థ పేర్కొంది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఏపీలో వర్షాలు (@APSDMA)

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంచనా వేసంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం…. తీరం వెంబడి గంటకు 40-50 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ముఖ్యంగా ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీలోకి రుతుపవనాలు…!

మరోవైపు నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలో ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే 8 రోజుల ముందే వచ్చినట్లు ఐఎండీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

తెలంగాణకు భారీ వర్ష సూచన:

మరోవైపు తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈజిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

రేపు(మే 26) నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం