ద్రోణి ప్రభావంతో ఏపీలో ఈ 2 రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 40-60 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచింది. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని హెచ్చరించింది.
ప్రకాశం,నెల్లూరు,నంద్యాల,కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి- మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందని అంచనా వేసింది.
ఇవాళ(జూన్ 11) విజయనగరం, పార్వతీపురంమన్యం, పశ్చిమగోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40- 41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక మరికొన్ని చోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
రేపు(జూన్ 12) వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు.
సంబంధిత కథనం