Cyclone Effect : ఏపీలో విస్తారంగా వర్షాలు….-heavy rains in south coastal districts of andhra pradesh and north tamilnadu with mondous effect ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Heavy Rains In South Coastal Districts Of Andhra Pradesh And North Tamilnadu With Mondous Effect

Cyclone Effect : ఏపీలో విస్తారంగా వర్షాలు….

తీరం దాటిన మాండౌస్ తుఫాను
తీరం దాటిన మాండౌస్ తుఫాను (HT_PRINT)

Cyclone Effect తుఫాను తీరం దాటినా దాని ప్రభావం ఏపీ అంతటా కనిపిస్తోంది. శుక్రవారం అర్థరాత్రి మాండౌస్ తీరం దాటి క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. మరోవైపు మాండౌస్‌ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మిగిలిన జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మాండౌస్ ప్రభావంతో ఏపీ అంతట ముసురు వాతావరణం నెలకొంది. తుపాను ప్రభావంపై ఏపీ సిఎం వైయస్‌.జగన్‌ సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎం అధికారులతో సమీక్షించారు.

Cyclone Effect బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాను తీరం దాటింది. మహాబలిపురం వద్ద తుఫాను తీరం దాటినా దాని ప్రభుత్వం ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా పడింది. చెన్నైతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 26జిల్లాల్లో మాండౌస్ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మాండూస్ తుఫాన్ తీరం దాటింది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రానికి తుఫాను వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తుఫాను కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటినప్పటికీ రేపటి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ వెల్లడించింది

మండౌస్‌ తుఫాను శుక్రవారం ఉదయానికి తుఫానుగా బలహీనపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. క్రమంగా వాయువ్య దిశగా పయనించి అర్థరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. శుక్రవారం అర్థరాత్రి 1.20కు తుఫాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.

శనివారం ఉదయానికి తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. శనివారం మధ్యాహ్నానికి అది మరింత బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రబావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. అన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.

శుక్రవారం సాయంత్ర నుంచి చలిగాలులు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తాలోని నెల్లూరు నుంచి పశ్చిమ గోదావరి వరకు తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

మాండౌస్ తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 125.75 మి.మీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా నాయుడు పేటలో 114మి.మీల వర్షపాతం నమోదైంది.

తుఫాను తీరం దాటడంతో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వెళ్లొద్దని సూచించారు.

మరోవైపు తుపాను ప్రభావం పై ఏపీ సిఎం వైయస్‌.జగన్‌ సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎం అధికారులతో సమీక్షించారు. వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీవర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.

ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. వారికి అన్నిరకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.

WhatsApp channel

టాపిక్