AP TG IMD Red Alert : ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్- ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
AP TG IMD Red Alert : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
AP TG IMD Red Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నానికి దగ్గరలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో అతి భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండడంతో మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు.
ఏపీ, తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా , గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే తెలంగాణలోని నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల, వనపర్తి, నారాయణపేటలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మరో రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నల్గొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, జిల్లాల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
రేపు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రేపు(ఆదివారం) ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్,నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
సంబంధిత కథనం