AP Weather : ఏపీకి రెయిన్ అలర్ట్... నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Rains in Andhrapradesh : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది.
Andhrapradesh Weather Update :బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాల పేర్లను ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు:
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇక తెలంగాణలో కూాడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 10వ తేదీ వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు.
మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. చలికాలం ప్రారంభమైనా.. ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గటం లేదు. దీంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో కూడా ఏసీలు,కూలర్లు మరియు ఫ్యాన్ లకే జనం అత్తుకుపోతున్నారు.