Haj Tour From Vijayawada: ఇకవిజయవాడ నుంచి హజ్ యాత్ర..అదనపు ఖర్చు భారాన్ని భరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం-haj pilgrimage from vijayawada the state government is bearing the burden of additional expenses ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Haj Tour From Vijayawada: ఇకవిజయవాడ నుంచి హజ్ యాత్ర..అదనపు ఖర్చు భారాన్ని భరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

Haj Tour From Vijayawada: ఇకవిజయవాడ నుంచి హజ్ యాత్ర..అదనపు ఖర్చు భారాన్ని భరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu
May 24, 2023 06:10 AM IST

Haj Tour From Vijayawada: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ ‍యాత్ర ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచి చేపట్టేలా ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్‌ ఏర్పాటు కావడంతో జూన్ 7 నుంచి విజయవాడ నుంచి హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయి.

హజ్ యాత్ర వివరాలు వెల్లడిస్తున్న మంత్రి అంజాద్ భాషా
హజ్ యాత్ర వివరాలు వెల్లడిస్తున్న మంత్రి అంజాద్ భాషా

Haj Tour From Vijayawada: ఆంధ్రప్రదేశ్ నుండి నేరుగా హజ్ht యాత్రను ప్రారంభించేందుకు విజయవాడ ఎయిర్ పోర్టు నుండి నేరుగా విమాన సదుపాయాలు కల్పించారు. విజయవాడ ఎయిర్ పోర్టులో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసి హజ్ యాత్రకు ప్రత్యేక ఎయిర్ లైన్స్ రాకపోకలకు వీలు కల్పించారు.

2023 జూన్ 7 నుంచి నుండి 2023 జూన్ 19 వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజూ విజయవాడ నుంచి 155 మంది హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 1,813 మంది హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.80,000 ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హజ్ వెళ్లే యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరు వద్ద ఉన్న మదరసాలో వసతి కల్పించారు. అక్కడి నుంచి ఏసీ బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుస్తారు.

రాష్ట్రంలో తొలిసారి యాత్రికులు నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంబార్కింగ్ పాయింట్ సాధించినట్లు డిప్యూటీ సిఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుండి 1,813 మంది యాత్రికులను నేరుగా పవిత్ర హజ్ యాత్రకు పంపుతున్నట్లు వివరించారు. ప్రతి రోజూ 155 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు.

కొత్తగా ఎంబార్కేషన్ పాయింట్ వచ్చాక వివిధ ఎయిర్ లైన్స్ ఏపీ నుండి యాత్రికులను హజ్ కు తీసుకెళ్లి మళ్లీ హజ్ నుంచి ఏపీకి తీసుకువచ్చే విధంగా ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. హైదరాబాద్, బెంగుళూరు ఎంబార్కేషన్ నుండి వెళ్లే ప్రతి ఒక్క యాత్రికుడి మీద రూ.80,000 అదనంగా భారం పడుతున్న పరిస్థితుల్లోముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింథియా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్క్మతి ఇరానీ తో చర్చించి హజ్ యాత్ర టికెట్ ధరను తగ్గించాలని కోరామన్నారు.

విమాన ఛార్జీలు తగ్గించలేని పరిస్థితుల్లో తమ రాష్ట్రం నుండి హజ్ కు వెళ్లే యాత్రికులను హైదరాబాద్, బెంగుళూరు నుండి వెళ్లే విధంగా అనుమతించాలని కోరామన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రులు చెప్పినట్లు అంజాద్ బాషా వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సూచనతో ప్రతి ఏటా యాత్రికుడిపై విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చుకు అదనంగా ఒక్కొక్కరికి రూ. 80,000 ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

 

WhatsApp channel