US New Rules: డిపోర్టేషన్ భయంతో USలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్న భారతీయ విద్యార్థులు?
US New Rules: అమెరికాలో తాజా ఆంక్షల భయంతో భారతీయ విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్టూడెంట్ వీసాలతో వెళ్లి అక్కడ పనులు చేస్తున్న వారు వాటిని వదిలేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
US New Rules: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను అణిచి వేయడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం, అక్రమ వలసదారుల్ని స్వస్థలాలకు తిప్పి పంపుతుడంటంతో డిపోర్టేషన్ భయాల నడుమ, అదనపు ఆదాయం అవసరం ఉన్నా, USలో చదువుతున్న భారతీయులు తమ పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించే వారిలో చాలామందికి ఉద్యోగాలు అవసరమైనా తాజా ఆంక్షల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో చదువులకు హాజరు కావడానికి తీసుకున్న రుణాల కారణంగా, విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలతో తమ చదువులు, భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తారని భయపడుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సరిహద్దు భద్రతను కఠినతరం చేయడం మరియు అక్రమ వలసదారులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకుని అనేక కార్యనిర్వాహక ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత ఈ భయాలు మరింత పెరిగాయి.
F-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌లో వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. అయితే చాలామంది భారతీయ విద్యార్థులు జీవన వ్యయాలను భరించుకోవడానికి రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు మరియు రిటైల్ స్టోర్‌లలో ఆఫ్-క్యాంపస్ ఉద్యోగాలపై ఆధార పడతారు.
“ నెలవారీ ఖర్చులను భరించుకోవడానికి కళాశాల తర్వాత ఒక చిన్న కేఫ్‌లో పనిచేశాను” అని ఇల్లినాయిస్‌లోని గ్రాడ్యుయేట్ విద్యార్థి ఒకరు వివరించారు.
" గంటకు 7డాలర్లు చొప్పున రోజుకు ఆరు గంటలు పనిచేయడం వల్ల డబ్బు లభిస్తుదని, ఇది సౌకర్యవంతంగా ఉన్నా అనధికార పనిపై ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో గత వారం ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్టు మరో విద్యార్థి పేర్కొన్నాడు. ప్రస్తుతం రిస్క్ చేయలేనని,అమెరికాలో చదువుకోవడానికి 50వేల డాలర్లు దాదాపు రూ. 42.5 లక్షలు అప్పు చేసి వచ్చినట్టు విద్యార్థి వివరించాడు.
న్యూయార్క్‌లోని మరో మాస్టర్స్ విద్యార్థి నేహా సైతం అర్జున్ తరహా అభిప్రాయాలను వ్యక్తం చేసింది. తన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలపై ఆందోళన చెందుతున్నానని చెప్పింది.
తనతో పాటు తన స్నేహితులు ప్రస్తుతానికి పని చేయడం మానేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇది కఠినమైనదే అయినా డిపోర్టేషన్ లేదా విద్యార్థి వీసాను కోల్పోవడానికి ఇష్టపడటం లేదని చెప్పారు.తమను అమెరికా పంపడానికి నా తల్లిదండ్రులు చాలా త్యాగం చేశారని చెప్పారు.
అమెరికా వెళ్లడానికి విద్యార్థుల కుటుంబాలు భారీగా అప్పులు చేస్తున్నారు. ఈ ఒత్తిడి కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. డిపోర్ట్ చేయబడే వ్యక్తుల సంఖ్య గురించి ఇంకా అంచనా లేదని, భారత్‌కు తిప్పి పంపే వారి భారతీయ మూలాన్ని ధృవీకరించాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.