Vetaran Journalist Bail : జర్నలిస్ట్‌ అరెస్ట్‌‌పై ఏపీ సిఐడికి కోర్టు అక్షింతలు…-guntur special court issued show cause notices to apcid police in journalist arrest issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Guntur Special Court Issued Show Cause Notices To Apcid Police In Journalist Arrest Issue

Vetaran Journalist Bail : జర్నలిస్ట్‌ అరెస్ట్‌‌పై ఏపీ సిఐడికి కోర్టు అక్షింతలు…

HT Telugu Desk HT Telugu
Sep 24, 2022 06:57 AM IST

Vetaran Journalist Bail వాట్సాప్‌ సందేశాలను గ్రూపుల్లో పోస్టు చేశారనే అభియోగాలపై ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన వెటరన్ జర్నలిస్ట్‌ వ్యవహారంలో గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో నిందితులకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టింది. నిందితుడు నోటీసులు తీసుకోలేదన్న సిఐడి పోలీసుల వివరణను కోర్టు తిరస్కరించింది.

ఏపీసిఐడికి గుంటూరు ప్రత్యేక కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసు
ఏపీసిఐడికి గుంటూరు ప్రత్యేక కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసు

Vetaran Journalist Bail గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని ఆరోపిస్తూ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన వెటరన్‌ జర్నలిస్టు కొల్లు అంకబాబుకు గుంటూరు ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రభుత్వాన్ని కించపరచడం, ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో వాట్సాప్ సందేశాలను పంపారని, సిఎంఓకు దురుద్దేశాలు అపాదించారని సిఐడి ఆరోపించింది. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో 41ఏ సిఆర్‌పిసి ప్రకారం నిందితుడికి నోటీసులు ఇచ్చారా, లేదా అని కోర్టు ప్రశ్నించింది.

ట్రెండింగ్ వార్తలు

నిందితుడు నోటీసులు తీసుకోలేదని సిఐడి పోలీసులు చెప్పడంతో అందుకు న్యాయస్థానం సాక్ష్యాలు చూపాలని అడిగింది. పోలీసులు మౌనం దాల్చడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అంకబాబును రిమాండ్‌కు తరలించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. సీఐడీ రిమాండ్‌ నివేదికను కొట్టివేసిన న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

మరోవైపు సిఆర్‌పిసి నిబంధనలు పాటించకపోవడంపై Vetaran Journalist Bail గుంటూరు కోర్టు సిఐడికి నోటీసులు జారీ చేసింది. నిందితుడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లుు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నాలుగురోజుల్లోగా జర్నలిస్ట్‌ అరెస్ట్ వ్యవహారంలో జరిగిన పరిణామాలను వివరించాలని కోర్టు ఆదేశించింది.

పవన్‌ ఆగ్రహం

అంకబాబు అరెస్టు వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారం రవాణాపై పోస్టు పెడితే అరెస్టు చేయడం దారుణమనారు. నిరసన తెలిపిన జర్నలిస్టుల అరెస్టు నిరంకుశ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేసినా సీఐడీ పట్టించుకోదంటూ విరుచుకుపడ్డారు.

మరోవైపు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు రిమాండ్ రిపోర్టును గుంటూరు కోర్టు తిరస్కరించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో సీనియర్ పాత్రికేయుడు అంకబాబు అరెస్ట్ అక్రమం అని కోర్టు ఆయన రిమాండ్ తిరస్కరించిందని, దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంకబాబుకు 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చే విషయంలో పోలీసులు చట్టాన్ని అనుసరించలేదని మేజిస్ట్రేట్ కోర్టు చెప్పిందని వివరించారు.

నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఐడీ పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. నోటీసులు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చారు? మీరు ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారనడానికి సాక్ష్యం ఏమిటి? అని కూడా న్యాయస్థానం ప్రశ్నించిందని చంద్రబాబు పేర్కొన్నారు.

అక్రమ అరెస్ట్ లకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ఏపీ పోలీసు శాఖను తీసుకువచ్చింది ఎవరు? అని నిలదీశారు. తమ తప్పుడు వైఖరికి సీఐడీ సిగ్గుపడాలని, రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైందని వివరించారు.

అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం పోలీసులు చేసే చట్ట ఉల్లంఘనలు బోనులో నిలబెడతాయని, మీ చర్యలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చంద్రబాబు హెచ్చరించారు.

IPL_Entry_Point