Guntur Brain Dead Woman : ప్రియుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, డబ్బు విషయంలో గొడవ-guntur rowdy sheeter attacked woman brain dead no more police arrested lover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Brain Dead Woman : ప్రియుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, డబ్బు విషయంలో గొడవ

Guntur Brain Dead Woman : ప్రియుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, డబ్బు విషయంలో గొడవ

Bandaru Satyaprasad HT Telugu
Updated Oct 22, 2024 10:30 PM IST

Guntur Brain Dead Woman : గుంటూరు జీజీహెచ్ లో కోమా దశలో చికిత్స పొందుతున్న యువతి సహానా మంగళవారం రాత్రి మృతి చెందింది. రౌడీ షీటర్ నవీన్ దాడిలో గాయపడిన యువతి బ్రెయిన్ డెడ్ అయ్యింది. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.

బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, పోలీసుల అదుపులో ప్రియుడు
బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, పోలీసుల అదుపులో ప్రియుడు

ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువతి సహానా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మృతి చెందింది. రౌడీ షీటర్ నవీన్ ...సహానా తలను కారు డాష్ బోర్డుకు గట్టిగా గుద్దటంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యింది. మూడు రోజుల నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై సహానాకు వైద్యం అందించారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి సహానా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

తెనాలి యువతి సహానాపై దాడి కేసులో రౌడీషీటర్ నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నవీన్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ జనార్దన్ రావు మీడియాకు వివరించారు. సహాన రౌడీ షీటర్ నవీన్ కు ఆరేళ్లుగా పరిచయం ఉంది. నవీన్, సహానా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెద్దవాళ్లు వారి పెళ్లిని వ్యతిరేకించారు. సహానా రౌడీ షీటర్ నవీన్ కు మూడు లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ డబ్బుల్లో రూ.1,50,000 నగదును నవీన్ సహానా తిరిగి ఇచ్చేశాడు. సహాన మిగిలిన డబ్బు అడగడంతో...కోపంతో సహానాను కారు డ్యాష్ బోర్డుకు గట్టిగా కొట్టాడు. తనకు తలనొప్పిగా ఉందని సహాన చెప్పడంతో ఆమెను హాస్పిటల్ తీసుకువెళ్లానని, అప్పటికే ఆమె స్పృహ కోల్పోయిందని నిందితుడు చెప్పాడు.

అసలేం జరిగింది?

శనివారం సాయంత్రం తన పుట్టిన రోజు అని సహానాను నవీన్ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. గంటల వ్యవధిలోనే సహానాను అపస్మారక స్థితిలో తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు. యువతి బంధువులు ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయిందని చెప్పడంతో... కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన తెనాలి టు టౌన్ పోలీసులు నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్‌, సహానాకు చాలా కాలంగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఆమె పని చేస్తున్న చోట కొంత నగదు అప్పుగా తీసుకుని నవీన్‌కు ఇచ్చింది. అతడు సమయం గడిచినా అప్పు తిరిగి ఇవ్వకపోవడం, ఇతర వ్యక్తిగత కారణాలతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో నవీన్ కారులో సహానా కొట్టడంతో ఆమె తల డోర్‌కు, డ్యాష్‌ బోర్డుకు తగిలి తీవ్ర గాయమైంది. తీవ్రమైన తలనొప్పి వస్తుందని యువతి గట్టిగా కేకలు వేయటంతో భయపడిన నవీన్‌ ఆమెను తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు.

సహానా తల్లిదండ్రులు ఆమెను రక్షించుకునేందుకు గుంటూరు, మంగళగిరిలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు తిప్పారు. అయితే వైద్యులు చేతులెత్తేయడంతో..చివరకు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరినప్పటికీ యువతి బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి యువతి మృతి చెందింది.

Whats_app_banner

సంబంధిత కథనం