SI Cheats Lover : ఏడాదిన్నరగా యువతితో ప్రేమాయణం, పెళ్లి చేసుకోమంటే మోహం చాటేసిన ఎస్సై!-guntur nagarampalem si ravi teja cheats lover with married women filed complaint with police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Guntur Nagarampalem Si Ravi Teja Cheats Lover With Married Women Filed Complaint With Police

SI Cheats Lover : ఏడాదిన్నరగా యువతితో ప్రేమాయణం, పెళ్లి చేసుకోమంటే మోహం చాటేసిన ఎస్సై!

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్సై
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్సై (Image Credit : Unsplash)

SI Cheats Lover : ఏడాదిన్నరగా ఓ యువతితో ప్రేమాయణం నడిపిన నగరపాలెం ఎస్సై.. పెళ్లి చేసుకోమంటే మోహం చాటేశాడు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

SI Cheats Lover : ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు ఎస్సై. ఏడాదిన్నరగా ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. చివరికి పెళ్లి చేసుకోమని అడిగితే మోహం చాటేశాడు. బాధిత యువతి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగుచూసింది. గుంటూరు నగరంపాలెంకు చెందిన ఎస్సై కుంచాల రవితేజ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గుంటూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతితో ఎస్సై రవితేజ ఏడాదిన్నరగా ప్రేమాయణం నడిపాడు. ప్రేమిస్తున్నానని చెప్పి అతడి అపార్ట్‌మెంట్ కు పలుమార్లు తీసుకెళ్లాడని యువతి ఫిర్యాదులో తెలిపింది. తీరా పెళ్లి విషయం ప్రస్తావించేటప్పటికీ మోహం చాటేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై యువతి ఎస్పీ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు విషయం తెలుసుకున్న ఎస్సై, అతడి కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని యువతి వాపోతుంది. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది.

ట్రెండింగ్ వార్తలు

పరారీలో ఎస్సై రవితేజ

ఎస్సై రవితేజపై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనపై సీఐ హైమారావు స్పందిస్తూ... యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అంతకు ముందు ఎస్సై రవితేజ మాత్రం ఆ యువతితో తనకు సంబంధంలేదని చెబుతున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. నగరపాలెం ఎస్సై రవితేజపై అట్రాసిటీ, రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు విషయం తెలుసుకున్న ఎస్సై రవితేజ పరారయ్యాడు. పరారీలో ఉన్న ఎస్సై కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్సై రవితేజకు సంబంధించిన వీడియోలను యువతి బయటపెట్టింది. తనకు న్యాయం చేయాలని పీఎస్‌లో ఆందోళనకు దిగింది. బాధిత యువతికి స్థానిక మహిళలు మద్దతు తెలిపారు.

కానిస్టేబుల్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

కృష్ణా జిల్లా పెనమలూరు తాడిగడప పరిధిలో మసాజ్‌ కేంద్రాలపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వందడుగుల రోడ్డులో స్పా సెంటర్, శ్రీనివాస నగర్‌ కాలనీలో పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కిషోర్‌ అద్దెకు ఇచ్చిన ఇంట్లో మసాజ్ కేంద్రం, పోరంకిలో మరో మసాజ్‌ కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రాలపై నిఘా పెట్టిన పోలీసులు ఆకస్మిక దాడులు చేసి, 12 మంది మహిళలు, ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ కిషోర్‌పై ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించారు.