Sangam Dairy : బోనస్ అడిగితే దాడి చేశారని ఫిర్యాదు, సంగం డెయిరీ డైరెక్టర్ అరెస్ట్- కేసులో ధూళిపాళ్ల కూడా!-guntur crime news in telugu sangam dairy director arrested in attack on milk farmer case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Guntur Crime News In Telugu Sangam Dairy Director Arrested In Attack On Milk Farmer Case

Sangam Dairy : బోనస్ అడిగితే దాడి చేశారని ఫిర్యాదు, సంగం డెయిరీ డైరెక్టర్ అరెస్ట్- కేసులో ధూళిపాళ్ల కూడా!

Bandaru Satyaprasad HT Telugu
Nov 19, 2023 02:20 PM IST

Sangam Dairy : సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో ఆ సంస్థ డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంగం డెయిరీ
సంగం డెయిరీ

Sangam Dairy : గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ వద్ద ఇటీవల కొందరిపై దాడి జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన చేబ్రోలు పోలీసులు సంగం డెయిరీ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాసరావుతో సహా మరో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని చేబ్రోలు పోలీస్ స్టేషన్​కు తరలించారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి ఘటనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సహా 15 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

బోనస్ ఇవ్వమంటే దాడి

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన ముసునూరి రాము ఫిర్యాదుతో పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. పాల విక్రయానికి సంబంధించి తమకు రావాల్సిన 14 శాతం బోనస్ ఇవ్వలేదని ప్రశ్నిస్తే... డెయిరీ వద్దకు పిలిచి దాడి చేశారని రాము తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద తమపై సంగం డెయిరీకి చెందిన వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. కర్రలు, హాకీ స్టిక్స్ తో కొందరు వ్యక్తులు తమపై దాడి చేసి తమ మూడు కార్లు ధ్వంసం చేశారని రాము ఆరోపించారు. రాము ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఈ కేసులో 14వ నిందితునిగా పోలీసులు పేర్కొన్నారు.

పరారీలో నిందితులు

నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశారు. పాల రైతులపై ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులతో దాడి చేయించారని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

WhatsApp channel