Guntur Crime : నగ్న పూజలు చేస్తే డబ్బులు వస్తాయ్, ఆశ చూపి యువతులను అత్యాచారం చేసిన పూజారి-guntur crime news fake pandit molested woman in the name of pujas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Guntur Crime News Fake Pandit Molested Woman In The Name Of Pujas

Guntur Crime : నగ్న పూజలు చేస్తే డబ్బులు వస్తాయ్, ఆశ చూపి యువతులను అత్యాచారం చేసిన పూజారి

Bandaru Satyaprasad HT Telugu
May 13, 2023 06:52 PM IST

Guntur Crime : ఈజీగా డబ్బు వస్తుందని ఆశ చూపి యువతులపై అత్యాచారం చేశాడో నకిలీ పూజారి. యువతులతో నగ్న పూజలు చేసి వారిపై దారుణాలకు పాల్పడ్డాడు.

నకిలీ పూజారి
నకిలీ పూజారి (Twitter)

Guntur Crime : తెలుగులో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ప్రజల వీక్ నెస్ లను క్యాష్ చేసుకుంటాడు. రెండు తలలు పాము, రైస్ పుల్లింగ్, లిల్లిపుట్ అంటూ ప్రజలను మోసం చేసి డబ్బు నొక్కేస్తాడు. ఇదే విధంగా డబ్బు ఈజీగా సంపాదించాలన్న ప్రజల వీక్ నెస్ ను పసిగడుతున్న కేటుగాళ్లు చింతపిక్కల పొడి, కర్ఫూరం, ఒత్తులు అంటగట్టి కోట్ల రూపాయలు దోచేసిన ఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగుచూశాయి. తాజాగా గుంటూరు జిల్లాలో నగ్న పూజలు చేస్తే డబ్బులు వస్తాయంటూ యువతులపై అత్యాచారం చేశారు నకిలీ పూజారి.

ట్రెండింగ్ వార్తలు

నగ్న పూజలు కలకలం

గుంటూరు జిల్లాలోని పొన్నెకల్లులో ఓ నకిలీ పూజారి నగ్నపూజలు చేస్తే డబ్బులు వస్తాయంటూ యువతులను ట్రాప్ చేశాడు. ఓ లాడ్జిలో యువతులతో నగ్న పూజలు చేసిన నకిలీ పూజారి... అనంతరం వారిపై అత్యాచారం చేశాడు. ఒక్కొసారి యువతులు ప్రతిఘటిస్తే పూజ మధ్యలో వెళ్లిపోతే డబ్బులు రావంటూ నమ్మించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నకిలీ పూజారి మోసాన్ని గుర్తించిన యువతులు దిశ యాప్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిలకలూరిపేటకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.

ఆంటీ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో ఓ వివాహిత కారణంగా యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పట్టణానికి చెందిన పృథ్వీ (30) స్థానికంగా ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నడుపుకుంటున్నాడు. తరచూ అక్కడకు వచ్చే ఓ వివాహితతో పృథ్వీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త సన్నిహిత సంబంధానికి దారి తీసింది. ఈ రిలేషన్ ను ఆసరాగా తీసుకుని ఆ వివాహిత యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. మహిళతో చనువుగా ఉన్నప్పుడు ఫోన్‌ సంభాషణలు, ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి తనను వేధిస్తోందని పృథ్వీ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ రివర్స్ లో యువకుడిపై ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరు ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహిత ఎస్పీని కలిసి స్పందనలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరిని విచారణకు పిలిచారు. శనివారం మరోసారి విచారణకు రావాలని ఇద్దరికీ సమాచారం ఇచ్చారు. అయితే గురువారం రాత్రి మహిళ పృథ్వీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. అతడు వెళ్లకపోవడంతో, అతడిని తీసుకురమ్మని మరో వ్యక్తిని పంపింది. దీంతో తప్పక పృథ్వీ ఆమె ఇంటికి వెళ్లాడు.

జరిగిన విషయాన్ని పృథ్వీ తన భార్యకు చెప్పాడు. బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని, అక్కడి వెళ్లి వచ్చాక ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని పృథ్వీకి అతడి భార్య చెప్పింది. ఆమె అలా పెళ్లికి వెళ్లగానే పృథ్వీ ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహిత వేధింపులతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివాహిత బాధితులు పట్టణంలో చాలా మంది ఉన్నారని పోలీసులు అంటున్నారు.

IPL_Entry_Point