AP New Districts | ఏపీ కొత్త జిల్లాలు.. కలెక్టరేట్లు ఎక్కడ ఉన్నాయంటే..-government notified addresses for new district office buildings in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Districts | ఏపీ కొత్త జిల్లాలు.. కలెక్టరేట్లు ఎక్కడ ఉన్నాయంటే..

AP New Districts | ఏపీ కొత్త జిల్లాలు.. కలెక్టరేట్లు ఎక్కడ ఉన్నాయంటే..

HT Telugu Desk HT Telugu

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. మెుత్తం 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను పభుత్వం నియమించింది. ఆర్డీవోల నియామకం సైతం జరిగింది. కలెక్టరేట్లను సైతం.. నోటిఫై చేసింది.

ఏపీ కొత్త జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులను సైతం ప్రభుత్వం నియమించింది. ఇంకా మిగిలిన కావాల్సిన అధికారులను నియమించేందుకు ప్రణాళిక చేస్తోంది. అయితే దాదాపు ప్రభుత్వ భవనాల్లోనే కలెక్టరేట్లు ఏర్పాటు అయ్యాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం.. ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకుని కలెక్టరేట్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

జిల్లాల వారీగా కలెక్టరేట్లు ఇవే..

 

శ్రీకాకుళం - కొత్తపేట జంక్షన్‌, శ్రీకాకుళం

విజయనగరం - కంటోన్‌మెంట్‌, విజయనగరం

విశాఖపట్నం – మహారాణిపేట, విశాఖపట్నం

మన్యం పార్వతీపురం - గిరిజన సంక్షేమ భవనం, పార్వతీపురం

అనకాపల్లి - ఇండో-అమెరికన్ ఇనిస్టిట్యూట్, శంకరం గ్రామ పంచాయతీ, అనకాపల్లి

అల్లూరి సీతారామరాజు – యూత్ ట్రైనింగ్ సెంటర్, పాడేరు

కాకినాడ - పాత కలెక్టరేట్, కాకినాడ

కోనసీమ - జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం, అమలాపురం

తూర్పు గోదావరి - నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్, రాజమహేంద్రవరం

ఏలూరు - పాత కలెక్టర్ భవనం, ఏలూరు

పశ్చిమ గోదావరి - శ్రీచైతన్య ఇంజినీరింగ్ కలశాల భవనం, భీమవరం

కృష్ణా - పాత కలెక్టరేట్ భవనం, మచిలీపట్నం

ఎన్టీఆర్ - సబ్ కలెక్టరేట్ కార్యాలయం, బందర్ రోడ్ విజయవాడ

గుంటూరు – పాతకలెక్టరేట్ కార్యాలయం, నగరం పాలెం, గుంటూరు

బాపట్ల – మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, బాపట్ల

పలనాడు - జలవనరుల శాఖ కార్యాలయ భవనం, నరసరావుపేట

ప్రకాశం - పాత కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు

నెల్లూరు - పాత కలెక్టరేట్ కార్యాలయం, నెల్లూరు

తిరుపతి - పద్మావతి నిలయం, తిరుపతి

చిత్తూరు - పాత కలెక్టర్ కార్యాలయం, రెడ్డిగుంట, చిత్తూరు

అన్నమయ్య జిల్లా – ప్రభుత్వ భవనం, రాజీవ్ స్వగృహ భవనాల పక్కన, రాయచోటి

కడప - కొత్త కలెక్టర్ కార్యాలయం సీ బ్లాక్, రిమ్స్ రోడ్, కడప

అనంతపురం – పాత కలెక్టర్ కార్యాలం, బెంగళూరు రోడ్డు, అనంతపురం

సత్యసాయి జిల్లా - సత్య సాయి మిర్పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, పుట్టపర్తి

కర్నూలు - కలెక్టర్ కార్యాలయం, బుధవారపేట, కర్నూలు

నంద్యాల జిల్లా - ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భవనం, నూనెపల్లి, నంద్యాల

 

పైన చెప్పిన చిరునామాలతోనే కలెక్టరేట్లు పని చేయనున్నాయి. 2023 నాటికి శాశ్వత భవనాలు నిర్మించే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దాదాపు అన్ని జిల్లాల కలెక్టరేట్లను ప్రభుత్వ భవనాల్లోనే.. ఏర్పాటు చేశారు.