ChandraBabu: ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు: చంద్రబాబు-government has not spent a single rupee on building houses says chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Government Has Not Spent A Single Rupee On Building Houses Says Chandrababu

ChandraBabu: ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు: చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 06:37 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు
టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు

కర్నూలులో టిడ్కో ఇళ్ల పరిశీలన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘ఒక అసంబద్ధ ముఖ్యమంత్రి, ఒక చేతకాని ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది ఈ టిడ్కో ఇళ్లను చూస్తే తెలుస్తోంది. వీరు విధ్వంసాన్ని ఏ విధంగా చేస్తారో ఇక్కడుండే టిడ్కో హౌసింగే ఒక ఉదాహరణ. ఇక్కడ గతంలో పదివేల ఇళ్లను ప్రారంభించాం. 90 శాతం పూర్తయ్యాయి. ఇది 580 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అందరికీ ఇళ్లు కట్టివ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులిచ్చింది. లక్షా 50 వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకొని నేనూ లక్షా 50 వేలు ఇచ్చి భూమి సేకరించి ఇచ్చి మంచి వాతావరణంలో ఇళ్లను ప్రారంభించాం..’ అని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘మధ్యతరగతిరి గేటెడ్ కమ్యునిటీ ఏర్పాటు చేయాలని ప్రారంభోత్సవం చేశాం. పేదవారికి సొంతింటి భావన ఉంటుంది. ఎప్పుడైన అమ్ముకోవచ్చనుకుంటే దానికి రియల్ ఎస్టేట్ వ్యాల్యు ఉంటుంది. ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా తయారు చేశాం. కమ్యూనిటీ హాల్, ప్రైమరీ సెంటర్, అంగన్వాడీ, స్కూల్క్ పెట్టాం. 3 లక్షల 10వేల టిడ్కో ఇళ్లు నిర్మించాం. పది శాతం పూర్తి చేసివుంటే లబ్దిదారులకు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేవి. మా ప్రభుత్వ హయాంలో 30 లక్షల ఇళ్లను ప్రారంభించాం. గృహ ప్రవేశాలు కూడా చేశారు. పేదవారికి ఇచ్చేసివుంటే మూడు, నాలుగు లక్షల ఆస్తి అయ్యేది. ఇప్పుడు మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది. ఈ టిడ్కో ఇళ్ల లోపలికి వెళ్లి చూస్తే అంతా తుప్పు పట్టిపోయాయి. గదులన్నీ బూజు పట్టి ఉన్నాయి. ఎంతో డబ్బు పెట్టి కట్టిన ఇళ్లు పనికిరాకుండా చేశారు. దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ్యత లేకుండా ప్రవర్తించారు..’ అని విమర్శించారు.

‘వ్యక్తిగతంగా లక్షా 50వేలు, ప్రభుత్వం ఇచ్చే ఒక లక్షా 50 వేలు మొత్తం 3 లక్షలతో బ్రహ్మాండంగా ఇళ్లు అయ్యేవి. ఆ స్కీమ్ కూడా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచారు. లేబర్ కాస్ట్ పెరిగింది. ముందుకంటే తగ్గించి ఇస్తే ఎలా ఇళ్లు కట్టుకోగలరు. ఏ ఒక్క రూపాయి ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ఖర్చు పెట్టలేదు. భూసేకరణ చేశామని చెప్పుకుంటున్నారే తప్ప ఉపయోగంలేదు. అడవుల్లో, చెరువుల్లో స్థలాలు ఇచ్చారు. వాటి వల్ల ఉపయోగం లేదు..’ అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

WhatsApp channel

టాపిక్