AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. టీడీపీకి 37, జనసేనకు 8.. పూర్తి వివరాలు ఇవే
AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి మొత్తం 705 పదవులను భర్తీ చేసింది. వీటిల్లో ఎక్కువగా టీడీపీకే దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. తాజాగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. 47 మార్కెట్ కమిటీలకు గాను.. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యాయి. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా వివరాలు వెల్లడించింది. ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో 37 టీడీపీకి, 8 జనసేనకు, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉంది.
వీరికే పదవులు..
బొబ్బిలి-నరుసుపల్లి వెంకట నాయుడు, కురుపాం- కదరాక కలావతి, నర్సీపట్నం- రుత్తల శేషుకుమార్, పలాస- మల్లా శ్రీనివాసరావు, రంపచోడవరం, లోతా లక్ష్మణరావు, సాలూరు- ముఖీ సూర్యనారాయణ, శృంగవరపుకోట (కొత్తవలస ఏఎంసీ)- చొక్కాకుల మల్లు నాయుడు, విశాఖపట్నం వెస్ట్ (విశాఖపట్నం)- యలమంచిలి అపర్ణ, పాలకొండ- బిద్దిక సంధ్యారాణిని ఏఎంసీ ఛైర్మన్లు, ఛైర్ పర్సన్లుగా ప్రభుత్వం నియమించింది.
దెందలూరు నుంచి..
దెందులూరు- గారపాటి రస్మిత, ఏలూరు- మామిల్లపల్లి పార్థసారధి, జగ్గంపేట- అడపా భరత్ బాబు, మండపేట- చింతపల్లి రామకృష్ణ, తణుకు- కొండేటి శివ, పిఠాపురం- వాకపల్లి దేవి, కాకినాడ రూరల్ (కరపా)- ముద్రగడ రమేష్, గన్నవరం ఎస్సీ (నగరం)- పెనుమాల లక్ష్మీ, తాడేపల్లిగూడెం- చాపల మంగబాయి, ఉంగుటూరు- కారేటి జ్యోతిలకు ఏఎంసీ పదవులు దక్కాయి.
మంగళగిరి నుంచి జన్వాడికి..
అద్దంకి- వరగాని పద్మావతి, బాపట్ల- కావూరి శ్రీనివాస రెడ్డి, గుడివాడ (గుడ్లవల్లేరు)- పొట్లూరి రవికుమార్, మంగళగిరి- జవ్వాడి కిరణ్ చంద్, నరసరావుపేట- పూనాటి శ్రీనివాస రావు, పెనమలూరు- అన్నె ధనరామ కోటేశ్వరరావు, సత్తెనపల్లి- కోమటినేని శోభారాణి, అవనిగడ్డ (ఘంటసాల)- తోట కనకదుర్గ, పామర్రు (మొవ్వ)- దోనెపూడి శివరామయ్య, మార్కాపురం- మాలెపాటి వెంకట రెడ్డి, నగరి- డి.రాజమ్మలకు ఏఎంసీ పదవులు దక్కాయి.
పీలేరు నుంచి..
పీలేరు- పీ.రామమూర్తి, పీలేరు (వాల్మీకీపురం)- కే.చంద్రమౌలి, సర్వేపల్లి- గాలి రామకృష్ణా రెడ్డి, గంగాధర నెల్లూరు (ఎస్సార్ పురం)- జీ.జయంతి, గుంతకల్- సుగాలి లక్ష్మీదేవి, హిందూపూర్- యూ.అస్వర్త నారాయణ రెడ్డి, కళ్యాణదుర్గం- బీ.లక్ష్మీదేవి, మడకశిర- బీఎస్ గురుమూర్తి, నంద్యాల గుంటుపల్లి హరిబాబు, మైదుకూరు- అందె పాపయ్యగారి వెంకట రవీంద్ర, పాణ్యం- అంగజాల గీత, పత్తికొండ- ఎస్.నబీ సాహెబ్, ఎమ్మిగనూర్- కురువ మల్లయ్య, ధర్మవరం- జగ్గ నాగరత్నమ్మలకు ఏఎంసీ పదవులు దక్కాయి.