AP Rains Alert: ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే కబురు, రానున్న మూడు రోజులు ఏపీలో తేలికపాటి వర్షాలు-good news for the people of ap light rains in ap for the next three days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains Alert: ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే కబురు, రానున్న మూడు రోజులు ఏపీలో తేలికపాటి వర్షాలు

AP Rains Alert: ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే కబురు, రానున్న మూడు రోజులు ఏపీలో తేలికపాటి వర్షాలు

Sarath Chandra.B HT Telugu

AP Rains Alert: మండే ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే కబురు వచ్చింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

ఏపీ ప్రజలకు తీపికబురు, రేపటి నుంచి మూడ్రోజులు వర్షాలు

AP Rains Alert: ఎండ వేడి, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారంశ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం(16-04-25)

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు,ప్రకాశం, నంద్యాల,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం (17-04-25)

శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

మరోవైపు సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లి, కర్నూలు జిల్లా వగరూరులో 41.8°C, నంద్యాల జిల్లా ఆలమూరులో41.7°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి 41డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయింది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం