Special trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖపట్నం - చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు-good news for railway passengers six special trains between visakhapatnam cherlapalli ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖపట్నం - చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

Special trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌, విశాఖపట్నం - చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Jan 17, 2025 09:23 AM IST

Special trains: ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రద్దీని తగ్గించడానికి ఈస్ట్‌ కోస్ట్ రైల్వేఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్ర‌జలు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

Special trains: సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

విశాఖపట్నం - చెర్లపల్లి - భువనేశ్వర్ (08549/08550)

1. రైలు నంబర్ 08549 విశాఖపట్నం - చెర్లపల్లి ప్రత్యేక రైలు జ‌న‌వ‌రి 18న రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, రాత్రి 8.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డ నుంచి రాత్రి 8.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.00 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది.

2. రైలు నంబ‌ర్ 08550 చెర్లపల్లి - భువనేశ్వర్ ప్రత్యేక రైలు జ‌న‌వ‌రి 19న ఉదయం 9.00 గంటలకు చెర్లపల్లి నుండి బయలుదేరి, దువ్వాడకు సాయంత్రం 6.40 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి, విశాఖపట్నంకు సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి, భువనేశ్వర్‌ ఉదయం 2.15 గంటలకు (జ‌న‌వ‌రి 20 తెల్లవారుజామున) చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖపట్నం - చెర్లపల్లి మ‌ధ్య‌ దువ్వాడ. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. సెకెండ్ ఏసీ-01, థ‌ర్డ్ ఏసీ-04, స్లీపర్ క్లాస్ - 09, జనరల్ సెకండ్ క్లాస్ - 04, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగజన్ కోచ్ -2 ఉన్నాయి.

విశాఖపట్నం – చెర్లపల్లి- విశాఖపట్నం (08509/08510)

1. రైలు నంబ‌ర్ 08509 విశాఖపట్నం - చెర్లపల్లి స్పెషల్ రైలు జ‌న‌వ‌రి 18న సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, సాయంత్రం 6.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డ నుంచి సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది.

2. రైలు నంబ‌ర్‌ 08510 చెర్లపల్లి - విశాఖపట్నం స్పెషల్ రైలు జ‌న‌వ‌రి 19న ఉద‌యం 10.00 గంటలకు చెర్లపల్లి నుండి బయలుదేరి, రాత్రి 21.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డ నుంచి రాత్రి 21.32 గంటలకు బయలుదేరి, రాత్రి 22.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-చెర్లపల్లి స్టేషన్ల మధ్య దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేష‌న్ల‌లో ఆగుతాయి. సెకెండ్ ఏసీ-01, థ‌ర్డ్ ఏసీ-01, స్లీపర్ క్లాస్ - 11, జనరల్ సెకండ్ క్లాస్ - 07, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగజన్ కోచ్ -2 ఉన్నాయి.

విశాఖపట్నం – చెర్లపల్లి- విశాఖపట్నం (08551/08552)

1. రైలు నంబ‌ర్‌ 08551 విశాఖపట్నం - చెర్లపల్లి ప్రత్యేక రైలు జ‌న‌వ‌రి 19న సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, సాయంత్రం 6.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డ నుంచి సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది.

2. రైలు నంబ‌ర్ 08552 చెర్లపల్లి - విశాఖపట్నం ప్రత్యేక రైలు జ‌న‌వ‌రి 20న ఉద‌యం 10.00 గంటలకు చెర్లపల్లి నుండి బయలుదేరి, రాత్రి 21.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డ నుంచి రాత్రి 21.32 గంటలకు బయలుదేరి, రాత్రి 22.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-చెర్లపల్లి స్టేషన్ల మధ్య దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేష‌న్ల‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్ల‌కు సెకెండ్ ఏసీ-01, థ‌ర్డ్ ఏసీ-01, స్లీపర్ క్లాస్ - 11, జనరల్ సెకండ్ క్లాస్ - 07, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగజన్ కోచ్ -2 ఉన్నాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner