Banks Holiday: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కనుమ రోజు బ్యాంకులకు సెలవు, రేపు, ఎల్లుండి హాలీడే..
Banks Holiday: ఏపీలో బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో జనవరి 15న బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Banks Holiday: ఏపీలో బ్యాంకులకు కనుమ పండుగ రోజున సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జీవో 73 జారీ చేశారు. కనుమ రోజు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాల చేసిన విజ్ఞప్తి మేరకు జనవరి 15వ తేదీన ప్రభుత్వ సెలవుగా ఖరారు చేసింది.
ఈ ఏడాది ఏపీలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14న మాత్రమే సెలవుగా ప్రకటించారు. డిసెంబర్‌లో జారీ చేసిన 2025 ప్రభుత్వ సెలవుల్లో జనవరి 14 మాత్రమే సెలవు ప్రకటించారు. దీంతో జనవరి 15న కనుమ పండుగ పూట బ్యాంకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండటంపై ఉద్యోగులు ఆందోళన చెందారు. దీనిపై యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనిట్ 15వ తేదీన సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ సంఘాల వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 15వ తేదీ బుధవారం కూడా బ్యాంకులకు సెలవును ప్రకటించింది. ఈ మేరకు 13వ తేదీన జిఏడి జీవో నంబర్ 73 విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణలు చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.