APPSC Group 2 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్ -2 పోస్టులు పెంపు, త్వరలోనే నోటిఫికేషన్!
AP Govt Latest News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. గ్రూప్ -2 పోస్టుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది.
APPSC Group 2 Posts Increase: నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోగా…. ఖాళీల సంఖ్యపై నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టాసారించగా… అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఆ దిశగా ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.
రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆగస్టు నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 597 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టులను ఉన్నాయి. గ్రూప్- 1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III, సబ్ రిజిస్ట్రార్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీంతో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది.
గ్రూప్ - 1 పోస్టులు - 89
డిప్యూటీ కలెక్టర్ - 12
డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్- 05
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్-04
డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ - 01
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 02
డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ - 01
మున్సిపల్ కమిషనర్ (Grade -2) - 01
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ - 03
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 06
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - కేటగిరీ -II - 25
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) - 01
అసిస్టెంట్ కమిషనర్ (ST) - 18
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 01
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 03
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 06
గ్రూప్ - 2 లో తొలుత 508 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిన సర్కార్.. తాజాగా 212 ఉద్యోగాలను చేర్చింది. ఫలితంగా ఈ సంఖ్య 720కు చేరనుంది.