Global Investment Summit :కీలక సమయంలో సమ్మిట్‌ నిర్వహించాం - సీఎం జగన్-gobal investor summit second day 2023 at vizag ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Gobal Investor Summit Second Day 2023 At Vizag

Global Investment Summit :కీలక సమయంలో సమ్మిట్‌ నిర్వహించాం - సీఎం జగన్

Mar 04, 2023, 01:21 PM IST HT Telugu Desk
Mar 04, 2023, 01:21 PM , IST

  • Global Investment Summit Updates 2023: విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండవ రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఎంవోయూలపై సంతకాలతో ప్రారంభమైంది.  10.30 గంటలకు ప్రముఖ ఇండో అమెరికన్‌ మ్యుజీషియన్‌ కర్ష్‌ కాలే బ్యాండ్‌ ప్రదర్శన పూర్తి అయింది.  ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడారు. శనివారం మొత్తం 8 రంగాలపై సెషన్లు ఉండనున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతమన్నారు. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్‌ ప్రకటించిందని గుర్తు చేశారు.  రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు..

(1 / 5)

సదస్సులో రెడ్డిస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి మాట్లాడారు.  ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారిందన్నారు.  ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయన్న ఆయన..  పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయని చెప్పారు. 

(2 / 5)

ఐఎస్‌ విజయానికి కృషి చేసిన  అందరికీ కృతజ్ఞతలు: తెలిపారు సీఎం జగన్‌. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందన్న ఆయన… కీలక సమయంలో సమ్మిట్‌ నిర్వహించామన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

(3 / 5)

సదస్సులో రెండో రోజైన శనివారం(  ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. 

(4 / 5)

సదస్సులో భాగంగా ముఖ్యమంత్రితో వివిధ దేశాల ప్రతినిధులు, రాయబారులు, దౌత్యవేత్తల బృందం భేటీ అయింది. పలు అంశాలపై చర్చించారు. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు