Garikapati Issue : గరికపాటి నరసింహారావుపై సంచలన ఆరోపణలు, తప్పుడు ప్రచారమంటూ గరికపాటి టీమ్ సీరియస్
Garikapati Issue : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై పెళ్లి, ఆస్తులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తాను గరికపాటి మొదటి భార్యగా అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను గరికపాటి టీమ్ ఖండించింది.
Garikapati Issue : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పెళ్లి, ఆస్తులపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. గరికపాటి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని, ఆయన మొదటి భార్యగా చెప్పుకుంటున్న కామేశ్వరి విడుదల చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె గరికపాటిపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై గరికపాటి టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం గరికపాటి కుటుంబసభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతోందని వెల్లడించింది. గరికపాటి టీమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
కొంత మంది వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువు తీస్తున్నారని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు. గరికపాటిపై వస్తున్న ఆరోపణలను నిరాధారం, సత్యదూరమని ఆయన టీమ్ పేర్కొంది. ఆయన ఎవరెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటూ ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం జరుగుతోందని వీటిని గరికపాటి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. గరికపాటిపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తామని గరికపాటి టీమ్ హెచ్చరించింది.
గరికపాటి నరసింహారావు...చిన్నతనంలోనే తనను లాకొచ్చి మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్నారని కామేశ్వరి అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు.
"మంచి భర్త, ఇద్దరు పిల్లలను ఇవ్వమని దేవుడిని అడిగితే.. పిల్లలను ఇచ్చాడు. కానీ నా భర్తను 25 ఏళ్లు భరించా, ఇక నేను భరించలేకపోయాను. ఉద్యోగం లేదు, డబ్బు లేదు. ఉన్న ఇంటినీ తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుని రాయించుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం నేను బయటకు వచ్చేశాను. ఆ తరువాత ఆయన వేరొక మహిళను పెళ్లి చేసుకున్నారు. నా పిల్లలను మంచిగానే పెంచాను. పెళ్లి చేశాను.
నాకేం రాదన్నారు. సంస్కృతం, తెలుగులో డిగ్రీ చేశాను. లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయ్యాను. పరాయి స్త్రీని తల్లితో సమానం చెప్పున్న గరికపాటి...తల్లి వరుసను కూనీ చేశారు. తన భవిష్యత్తుకు అడ్డు వస్తున్నాని నన్ను హింసించి బయటకు పంపించేశారు. ఇప్పటి వరకు నేను బయటకు రాలేదు. కానీ ఈ వ్యక్తి యూట్యూబ్ లలో మాట్లాడుతూ.. నేను శ్రీరాముడిని, ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు. మీకు అన్యాయం జరిగితే ఎదిరించాలని చెప్పుకొచ్చారు. అది విన్నాక నాకు కూడా అన్యాయం జరిగింది కదా అని అందుకే బయటకు వచ్చి మాట్లాడాను. నేనేదో వీడియోలు పెట్టుకుంటుంటే... నా కన్నకొడుకుతోనే నాపై పోలీస్ కేసు పెట్టించారు" అని కామేశ్వరి వీడియో పోస్టు చేశారు.
సంబంధిత కథనం