Srikakulam Gang Rape: శ్రీకాకుళం జిల్లాలో ఘోరం...పుట్టినరోజు వేడుకల పేరుతో ఇద్దరు విద్యార్థినులపై సామూహిక అత్యాచారం
Srikakulam Gang Rape: శ్రీకాకుళంలో జిల్లాలో ఘోరం సంఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఇద్దరు విద్యార్థినులపై సమూహిక అత్యాచారం జరిగింది. బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Srikakulam Gang Rape: శ్రీకాకుళంలో జిల్లాలో ఘోరం సంఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఇద్దరు విద్యార్థినులపై సమూహిక అత్యాచారం జరిగింది. బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దారుణమైన ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకల పేరిట స్నేహితురాళ్లను తీసుకెళ్లిన యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ ఘటన పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం బయటకు వచ్చింది. పలాస పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థినులు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులుగా ఉన్నారు.
అయితే ఈనెల 19న వారిలో ఒక యువకుడి పుట్టిన రోజు కావడంతో అందరూ కలిసి పాట్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద బిర్యానీలు, స్వీట్‌షాప్‌లో కేక్‌లు, గిఫ్ట్‌లు కొనుక్కుని ద్విచక్ర వాహనాలపై పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక కాలనీకి చేరుకున్నారు. అక్కడ కేక్ కట్ చేసి భోజనాలు చేసిన తరువాత ఇద్దరు విద్యార్థినులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారు ఎంత వారికించినా వినిపించుకోకుండా సామాహికంగా అత్యాచారం చేశారు.
మరో విద్యార్థిని తనపై జరిగే లైంగిక దాడి నుండి తప్పించుకోగలిగింది. ఈ లైంగిక దాడి నుండి తప్పించుకున్న విద్యార్థిని వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో అత్యాచారానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు విషయం తెలిసింది. అయితే పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బాధిత విద్యార్థిని ఒకరు సోమవారం అనారోగ్యానికి గురవ్వడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
పరువు కోసమే బాధిత తల్లిదండ్రులు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. బాధితురాల్లో ఒకరు అత్యాచారం వల్ల అనారోగ్యానికి గురైంది. అందువల్లనే బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఈ ఘటన రెండు రోజుల ఆలస్యంగా బయటకు వచ్చింది. రెండో బాధితురాలు ఇంకా ఫిర్యాదు చేయలేదు.
అయితే అత్యాచారం నుంచి తప్పించుకున్న విద్యార్థిని తమను పుట్టినరోజు వేడుకకు పిలిచారని, తాము అందుకనే వెళ్లామని ఆమె తల్లిదండ్రులతో చెప్పింది. కానీ అక్కడికి వెళ్లిన తరువాత పుట్టిన రోజు వేడుక అయిన తరువాత అత్యాచారం చేశారని పేర్కొంది. ఎంత ప్రతిఘటించిన వదలకుండా తన స్నేహితురాళ్లుపై అత్యాచారం చేశారని ఆమె తల్లిదండ్రులకు వివరించింది. తాను ఎలాగోలా తప్పించుకున్నానని తెలిపింది. లేకపోతే తాను కూడా అత్యాచారానికి బలైపోయేదాన్ని అని పేర్కొందని పోలీసులు తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, )