Kakinada Road Accident: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు దుర్మరణం-four killed in road accident at kakinada district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Four Killed In Road Accident At Kakinada District

Kakinada Road Accident: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 07:49 AM IST

Road accident at kakinada district: కాకినాడ జిల్లా మల్లేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిెంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.

కాకినాడలో ఘోర ప్రమాదం
కాకినాడలో ఘోర ప్రమాదం

Four Killed in Road Accident at Kakinada: ఏపీలోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో... నలుగురు దుర్మరం చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

తాడేపల్లి నుంచి విశాఖ వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి అనకాపల్లిలో అమ్మవారు వేషాలు వేయడానికి కళాకారుల బృందం.. టాటా మ్యాజిక్ వాహనంలో బయలుదేరింది. ప్రమాద సమయంలో టాటా మ్యాజిక్ వాహనంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా వేషాలు వేయడానికి వెళుతున్నారని.. ఈ సమయంలో మల్లేపల్లి దగ్గర టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్