అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26న ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఉదయం 10 గం.లకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.