Sake Sailajanath: వైసీపీలో చేరిన మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌-former pcc president sake sailajanath joins ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sake Sailajanath: వైసీపీలో చేరిన మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌

Sake Sailajanath: వైసీపీలో చేరిన మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 07, 2025 11:23 AM IST

Sake Sailajanath: మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2023లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు అరెస్ట్‌ కావడంతో శైలజానాథ్‌ ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్‌
వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్‌

Sake Sailajanath: మాజీ మంత్రి, పీసీసీ  మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. కొంతకాలంగా  రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న శైలజానాథ్‌ 2023లో టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. శైలజానాథ్‌ టీడీపీలో చేరే సమయంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అప్పట్లో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా పరామర్శించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది. ఈ కోవలో అన్ని స్థాయిల నాయకులు ఉన్నారు. మాజీ మంత్రులు కూడా ఉన్నారు. పార్టీలు మారిన వారి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకుండా ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

ఏపీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌  చాలా కాలంగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.  శైలజా నాథ్‌ కొంత కొన్నేళ్లుగా ఏదొక ప్రత్యామ్నయం చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పీసీసీ పదవి కోల్పోయిన తర్వాత ఏదొక పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు.  

రాష్ట్ర విభజన  పదేళ్లకు పైగా  అధికారానికి దూరంగా ఉండటంతో మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీరా రెడ్డి తర్వాత శైలజానాథ్‌ ఏపీ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటం, బలమైన నాయకులు ఎవరు పార్టీలో మిగలకపోవడంతో శైలజానాథ్ కూడా తన దారి తాను చూసుకోవాలని కొన్నేళ్ల క్రితమే భావించారు. 

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో రెండుసార్లు శైలజా నాథ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైఎస్‌ క్యాబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు.

శైలజానాథ్‌ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరాలని భావించారు. అంతా సిద్ధమైన సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకుంటున్న సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది.   ఈ క్రమంలో  శైలజానాథ్‌ చంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజమండ్రి కూడా వెళ్లారు. రాజమండ్రిలో   చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో మాట్లాడిన తర్వాత శైలజానాథ్‌ ఆలోచనలు మారిపోయాయి. టీడీపీ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందోననే సందేహంతో ఆ పార్టీలో చేరకుండా ఆగిపోయారు. 

ఏపీలో రాజకీయంగా నెలకొన్ని ఉన్న పరిస్థితుల మధ్య టీడీపీలోకి వెళ్లడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయంతో  శైలజానాథ్‌ టీడీపీకి దూరంగా ఉండిపోయారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర‌్శించే క్రమంలో మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించడంతో శైలజానాథ్‌ ఖంగుతిన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత  ఆయన వైసీపీలో చేరారు. 

Whats_app_banner