Vizag : మరో అమ్మాయితో ఎఫైర్...! భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త-former miss vizag husband caught red handed with another young woman ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag : మరో అమ్మాయితో ఎఫైర్...! భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త

Vizag : మరో అమ్మాయితో ఎఫైర్...! భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త

HT Telugu Desk HT Telugu
May 30, 2024 08:49 PM IST

Ex Miss Vizag Nakshatra Husband : తన భర్త మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడంటూ ఆరోపిస్తూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. విశాఖలోని ఓ ఇంట్లోకి వెళ్లిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

మాజీ మిస్ వైజాగ్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త
మాజీ మిస్ వైజాగ్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త

Ex Miss Vizag Nakshatra Husband : మాజీ మిస్ వైజాగ్ భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ‌ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితో అపార్ట్మెంట్ లో ఉన్న వెంకట తేజను ఆయన భార్య, మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

తన భర్త తనకే కావాలని ఆమె పోరాటానికి దిగింది.‌ తనకు‌ విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని‌ ఎలా పెళ్లి చేసుకున్నాడని నిలదీసింది. తన కాపురంలో చిచ్చుపెట్టిందని ఆ అమ్మాయిని నక్షత్ర చితకబాదింది. అడ్డుపడిన భర్త చెంపను చెళ్లుమనిపించింది.‌ అనంతరం తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి వద్ద నిరాహారదీక్షకు దిగింది.

2017లో పెళ్లి…..

2012లో నక్షత్ర మిస్ వైజాగ్ గా ఎంపికైంది. దీంతో సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అప్పుడు త్రిపురనేని సాయి వెంకట తేజతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.‌ కొంత కాలం ప్రేమలో ఉన్న ఇద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. తరువాత వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే పెళ్లయిన తరువాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడివిడిగా ఉన్నారు. ఈ సమయంలో తేజ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు.‌ ఆమె పెళ్లి చేసుకుని వేరే కాపురం కూడా పెట్టాడు.

ఆ విషయం తెలుసుకున్న నక్షత్ర గురువారం ఉదయం వైజాగ్ లోని  ఓ అపార్టుమెంట్ లో భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ ఫ్లాట్ కు వెళ్లి, అక్కడ వేరే అమ్మాయితో తన భర్త తేజ ఉండటంతో ఆందోళనకు గురైంది. వేరే అమ్మాయితో భర్త ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన నక్షత్ర… ఆ అమ్మాయిపై దాడికి దిగింది. ‌దీంతో భర్త అడ్టు వచ్చాడు. అడ్డొచ్చిన భర్త చెంప కూడా చెళ్లుమనిపించింది. అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.

అమ్మాయిలను‌ ట్రాప్ చేశాడు: నక్షత్ర

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫ్లాట్ లో తేజతో ఉన్న అమ్నాయిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందే కుమార్తెతో కలిసి ఆందోళనకు దిగింది. ఆవేదన చెందిన నక్షత్ర, తన భర్త గురించి అసలు విషయాలను వివిరించింది.‌ 

పబ్జీ గేమ్ ఆడి చాలామంది అమ్మాయిలను తేజ ట్రాప్ చేశాడని చెప్పింది. నేను అందంగా ఉండటంతో తనతో చాలామంది అమ్మాయిలు శారీరక సంబంధాల కోసం ఇష్టపడుతున్నారని నాకే చెప్పాడని నక్షత్ర తెలిపింది. తనకు రోజుకొక అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని సంచలన ఆరోపణలు చేసింది. మరోవైపు భర్త తేజ కూడా నక్షత్రపై ఆరోపణలు చేశారు. తనపై నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఆ కేసు కోర్టులో ఉందని, దానిపై కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపాడు. అయితే తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్ కోసం మాత్రమే వచ్చిందని అన్నారు.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, ఏపీ.

Whats_app_banner