శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం-floods to srisailam power generation begins at hydropower stations and rain alert to andhra pradesh for coming days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

Anand Sai HT Telugu

శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల వద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఆనకట్టకు 58,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

శ్రీశైలం డ్యామ్ (File Photo)

్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల వద్ద విద్యుత్ ఉత్పత్తి మెుదలైంది. నాగార్జున సాగర్ ఆనకట్టకు 58,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల ఎగువ పరివాహక ప్రాంతం నుండి జలాశయానికి 1,00085 క్యూసెక్కుల వరద నీరు గణనీయంగా వస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి, శ్రీశైలం వద్ద నీటి మట్టం 874.30 అడుగులుగా నమోదైంది, నీటి నిల్వ స్థాయిలు 160.52 టీఎంసీలుగా ఉన్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా మేఘావృతమైన రోజు ఉండనుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్తర ఆంధ్ర, కోస్తా ఆంధ్ర అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా పడవచ్చు. ఉత్తర ఆంధ్ర అంతటా గాలులు వీస్తున్నాయి. ఇది వాతావరణ మార్పులకు కారణంగా ఉంది. ఇతర ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన దానికి భిన్నంగా, రాయలసీమ నేడు పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం నివేదించింది.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు ప్రభావితం చేస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున తెలంగాణలోని 19 జిల్లాల్లో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3, 4వ తేదీల్లో వానకు ఎక్కువగా పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.